For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోన్ లెస్ మటన్ సుక్క: స్పైసీ ట్రీట్

|

ఎప్పుడూ రెగ్యులర్ గా చేసే మటన్ కర్రీ మరియు మటన్ ఫ్రై వంటలతో బోరుకొడుతున్నదా? మరి మీ టేస్ట్ బడ్స్ కు రీచార్జ్ అవ్వాలంటే ఒక కొత్త రుచిని చూపించాల్సిందే. మటన్ సుక్క రిసిపి , పేరు వినే ఉంటారు. ఇది ఎక్కువగా రెస్టారెట్లలో అందుబాటులో ఉంటుంది. ఇంకా సౌత్ ఇండియన్ డెలిషియస్ నాన్ వెజ్ రిసిపి. ఈ మటన్ సుక్క రిసిపిని ఎక్కువగా సైడ్ డిష్ గా తీసుకుంటుంటారు. సాంబార్, రసం, మరియు రైస్ కు మంచి కాంబినేషన్ నాన్ వెజ్ సైడ్ డిష్ ఇది.

ఈ మటన్ సుక్క రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేయవచ్చు. ఈ వంటకు కొన్ని సౌంత్ ఇండియన్ మసాలా దినుసులు ఉపయోగించి కొంచెం డ్రైగా తయారుచేయడం వల్ల మీ ఇంటిల్లిపాదికి నోరూరిస్తుంటుంది. ఈ వంటను వీక్ డేస్ లో కూడా ఒక విలాసవంతమైన డిన్నర్ డిష్ గా వండుకోవచ్చు . మరి మీరు కూడా మటన్ సుక్క రిసిపిని రుచి చూడాలంటే, తయారుచేయు విధానం తెలుసుకోవాలి.

Boneless Mutton Sukka: A Spicy Treat

కావల్సిన పదార్థాలు:
మటన్ (ఎముకలేని): 1 kg
ఉల్లిపాయలు: 5 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 4(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కరివేపాకు: 10
ఎండు మిర్చి: 4
మిరియాలు : 2tsp
జీలకర్ర : 1tsp
ఏలకుల (ఆకుపచ్చ): 2
దాల్చిన చెక్క: 1 అంగుళం
లవంగాలు: 4
జీలకర్ర: 1tsp
ధనియాలు: 2tsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: ½cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బోన్ లెస్ మటన్ ను శుభ్రంగా కడిగి, నిమ్మరసం, పసుపు, కారం మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ ను కుక్కర్ లో వేసి, కొద్దిగా నీరు పోసి 2-3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. అంతలోపు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క మరియు సోంపు ఫ్రైయింగ్ పాన్ లో వేసి దోరగా వేగించుకోవాలి.
4. వేగించుకొన్న మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి 5నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
6. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కరివేపాకు వేసి వేగించాలి.
7. ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసుకొన్ని మసాలా పౌడర్ సగం వేసి, ఫ్రై చేయాలి.
8. వెంటనే టమోటో ముక్కలు ఉప్పు కూడా వేసి వేగించుకోవాలి.
9. టమోటో మెత్తగా ఫ్రై అయిన తర్వాత, ప్రెజర్ కుక్కర్ లోని మటన్ లోని నీరు పక్కన వంపి పెట్టుకొని, మటన్ ముక్కలను మాత్రం వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
10. తర్వాత మటన్ ఉడికించిన నీళ్ళలో సగం అందులో పోసి మరో 10నిముషాలు మసాలతో పాటు ఉడికించాలి. ఉడికేటప్పుడు అందులో మిగిలిన మసాల పౌడర్ ను వేసి, బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
11. చివరగా కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయాలి. అంతే బోన్ లెస్ మటన్ సుక్క రెడీ. ఇది రసం మరియు రైస్ తో మంచి కాంబినేషన్.

English summary

Boneless Mutton Sukka: A Spicy Treat

Are you bored of the same old mutton curries and fries? We can give you a dish that will recharge your taste buds. We present to you the mutton sukka recipe that is a South Indian delicacy that every non-vegetarian will enjoy. This mutton sukka is usually eaten as side dish with sambar or rasam rice.
Story first published: Tuesday, September 23, 2014, 18:14 [IST]
Desktop Bottom Promotion