For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టర్ (వెన్న)గార్లిక్ ఫిష్ ఫ్రై రిసిపి

|

బట్టర్ గార్లిక్ ఫిష్ ఫ్రై పాపులర్ ఇండియన్ రిసిపి. చాలా సింపుల్ గా చేయదగినటువంటి వంటకం. చాలా సింపుల్ గా చందువా ఫిష్ ఫిల్లెట్ ను బట్టర్ తో మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై రిసిపితో గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫిష్ బటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఇది బెంగాల్ లో చాలా పాపులర్ అయిన ఫేవరెట్ వంటకం. పెళ్ళి రోజు లేదా బర్త్ డే పార్టీలకు ఓ మంచి టేస్ట్ ఉన్న ఈ బెంగాల్ ఫేవరెంట్ ఫిష్ ఫ్రై మనం కూడా చేసుకోవచ్చు. వండే పదార్థాలు కొంచెం ఎక్కువైన రుచి అద్భుతంగా ఉంటుంది. సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం...

Butter Garlic Fish Fry

కావల్సిన పదార్థాలు:

చందువా చేప ముక్కలు: 1/2kg
మైదా: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
బట్టర్(వెన్న): 2tbsp
బేకింగ్ పౌడర్: 1tsp
వెల్లుల్లి, కొత్తిమీర తురుము: 2tbsp చొప్పున
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సౌడర్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి కలుపుకోవాలి.
2. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి జారుడుగా గట్టిగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు అలాగే నాననివ్వాలి. అరగంట నుండి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి అలాగే పక్కనుంచాలి.
4. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి గోల్డ్ అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకోవాలి. అంతే గార్లిక్ బట్టర్ ఫిష్ ఫ్రై రెడీ...

English summary

Butter Garlic Fish Fry


 Butter fish fry is a very popular Bengali recipe. It is a very simple fish recipe where some fish fillets are marinated and then fried in a batter. This butter fish recipe is generally eaten as a complement to the main course dish. You can even make a gravy preparation with this fish fry recipe. But here we will to make a dry butter fish recipe.
Story first published: Saturday, November 29, 2014, 12:35 [IST]
Desktop Bottom Promotion