For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ టేస్ట్ అండ్ హెల్తీ క్యాలిప్లవర్‌ - ఎగ్ ఫ్రై

|

కాలీఫ్లవర్‌ కూడా ఓ రకమైన పువ్వు జాతికి చెందినదే. విదేశాల నుండి భారతదేశానికి చేరింది. కాలీఫ్లవర్‌ పువ్వులలో చాలా ఖాళీలు ఉంటాయి. వీటి మధ్య పురుగులు ఉంటాయి. అందువలన చాలామంది ఈ పువ్వును తీసుకొనరు. దీనికి తోడు ధర కూడా ఎక్కువ. ఏది ఏమైనప్పటికి ఈ కాలీఫ్లవర్‌ పువ్వులలో సి విటమిన్‌ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల లవణాలు ఉంటాయి. అందువలన ఖరీదు ఎక్కువ అయినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా, కనీసం అప్పుడప్పుడైనా కాలీఫ్లవర్‌ను కూర రూపంలో గాని, మరొక విధంగా కానీ తీసుకోవటం మంచిది.

నిజానికి, క్యాబేజి కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది కాలీఫ్లవర్‌. విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫోలేట్‌ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్‌ కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది. వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది.

Cauliflower and Egg Fry

కాలీఫ్లవర్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇలాంటి వంటల్లో క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్ధాలు
కాలీఫ్లవర్‌(చిన్నసైజు): 1
గుడ్లు: 3
కారం: 4tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: చిటికెడు
నూనె: సరిపడా
కొత్తిమీర: 1కట్ట
ఆవాలు: 1/2tsp
మినపప్పు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేసే విధానం:
1. ముందుగా కాలీఫ్లవర్‌ ను చిన్నగా కట్‌ చేసుకోవాలి. లేదా తురుము కోవాలి.
2. ఆ తర్వాత పోపు తాలింపు పెట్టి క్యాలీఫ్లవర్‌ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి.
3. ఆ తర్వాత కొద్దిగా నీరు(చిన్న గ్లాసు) పోసి ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వెయ్యాలి.
4. ఆతర్వాత బాగా నూనెలో వేయించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి.
గమనిక: (నీరు కొద్దిగా వేయాలి. లేకపోతే కూర ముద్దగా ఉంటుంది).

English summary

Cauliflower and Egg Fry | స్పెషల్ టేస్ట్ అండ్ హెల్తీ క్యాలిప్లవర్‌ - ఎగ్ ఫ్రై

This is a simple, yet nutritious dish made with cauliflower and eggs, both food have amazing health benefits.This cooking method (stir fry) will not reduce it's nutritional value.
Story first published: Saturday, May 4, 2013, 16:03 [IST]
Desktop Bottom Promotion