For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెట్టినాడ్ చికెన్ ఫ్రై : వీకెండ్ స్పెషల్

|

మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది.

చాలా వంటలను అక్కడ చెడ్డినాడ్ రిసిపిలుగా పేరు మార్చారు . ఎందుకంటే ఇవి చాలా సింపుల్ గా మరియు ఆరోమా స్మెల్ తో అద్భుంగా నోరూరిస్తుంటాయి. మీరు వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వంటలను రెండింటిని చెట్టినాడ్ స్టైల్లో తయారుచేయవచ్చు . చెట్టినాడ్ చికెన్ ఫ్రై పాపులర్ నాన్ వెజిటేరియన్ రిసిపి. దీన్ని వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు . మరి మీరు కూడా ఈ స్పెషల్ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ తయారుచేసి, రుచిచూడండి....

Chettinad Chicken Fry: Weekend Special

కావల్సిన పదార్థాలు:

చికెన్: 500grms
టమోటోలు: 2
ఉల్లిపాయలు: 4
కరివేపాకు: 4 రెమ్మలు
కొత్తీమీర: కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కొద్దిగా
మసాలా కోసం :
ధనియాలు: 2tsp
జీలకర్ర: 1/2tsp
ఎండుమిర్చి: 8
మిరియాలు: 1/2tsp
అనాసపువ్వు: 1
మరాఠీ మొగ్గ: 2

తయారుచేయు విధానం:

1. ముందుగా శుభ్రంగా కడిగిన చెకిన్ ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మసాలా ముద్దకోసం తీసుకొన్ని పదార్థాలన్నింటిని పాన్ లో వేసి బ్రౌన్ కలర్ లో వచ్చే వరకూ వేగించుకవోాలి.
3. వేయించుకొన్న మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తని ముద్దగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ నుండి సగం తీసి చికెన్ ముక్కలకు పట్టించాలి.
4. అరగంట తర్వాత ఈ చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి నీరు ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత పాన్ లో నూనె వేడి చేయాలి. అందులో ఉడికించి పెట్టుకొన్న చికెన్ ముక్కల్ని వేయించి తీసి పక్కన పెట్టుకవోాలి.
6. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కుల, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిన మసాలా ముద్ద వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో టమోటో ముక్కులు కూడా వేసి మరో 5నిముషాలు వేగనివ్వాలి.
7. ఇప్పుడు అందులో వేయించిన పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి కూర ఫ్రైగా అయ్యే వరకూ వేయించి కరివేపాకు కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే చెట్టినాడ్ చికెన్ ఫ్రై రెడీ.

English summary

Chettinad Chicken Fry: Weekend Special

Chettinad recipes are very popular in the Southern states of India. It is a region of the Sivaganga district of southern Tamil Nadu . The place is not only famous for its spicy delicacies but also for the Chettinad sarees.
Story first published: Saturday, April 19, 2014, 17:46 [IST]
Desktop Bottom Promotion