For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెట్టినాడ్ మటన్ కర్రీ : పాపులర్ రిసిపి

|

మాంసాహారులుకు చెట్టినాడ్ స్టైల్ వంటలంటే చాలా ఇష్టం. కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులతో మాసాలా పేస్ట్ తయారుచేసుకొని తయారుచేసే ఈ వంటలు ఎల్లప్పుడూ నోరూరిస్తుంటాయి.

చెట్టినాడ్ వంటలు తమిళనాడు స్పెషల్ వంటలు. ఈ వంటలు సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి వంటలు. ఈ నాన్ వెజ్ వంటకు ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే మసాలా గ్రేవీని తయారుచేయడమే . మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఒక సారి ట్రై చేయండి...

Chettinad Mutton Curry Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్-½ kg (ముక్కలుగా కట్)
చెక్క 1
లవంగాలు: 2
యాలకులు: 2
స్టార్ సొంపు: 1
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1tsp
టమోటో: 2 (చిన్న ముక్కలుగా తరిగి)
కొబ్బరి పాలు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup
కొత్తిమీర తరుగు: 2tbsp
మసాలా పేస్ట్ కోసం :
దాల్చిన చెక్క: 1
లవంగాలు: 2
యాలకులు 2
జీలకర్ర: 1tsp
సోంపు: 1tsp
ఎండు మిర్చి 5
ధనియాలు: 3tsp
కొబ్బరి తురుము: 3tbsp
నూనె: 3tbsp
జీడిపప్పు: 5
తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, వాటికి ఉప్పు మరియు పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి మసాలా పేస్ట్ కోసం సిధ్దంగా పెట్టుకొన్నపదార్థాలను పాన్ లో వేసి 5 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మసాలాను చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల, స్టార్ ఆన్సీ మరియు ఉల్లిపాయలు వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు మరియు మసాలా పేస్ట్ వేసి 5-6నిముషాలు వేయించుకోవాలి.
7. వేగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి.
8. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గే వరకూ ఉండి తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పాలు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. 5 నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసి రోటి మరియు రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Chettinad Mutton Curry Recipe

Chettinad cuisine is a real delight for meat lovers. The unique blend of the spices used in the Chettinad preparations make the curries totally irresistible for your taste- buds. The fragrant spices give the Chettinad curries a burst with some delectable flavors and make the dish look so tempting that you just cannot stop yourself from tasting it.
Story first published: Friday, April 11, 2014, 18:22 [IST]
Desktop Bottom Promotion