For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెట్టినాడ్ ఫిష్ కర్రీ: నాన్ వెజ్ స్పెషల్

|

చెట్టినాడ్ స్టైల్ రిసిపిలు తమిళనాడులో ఒక ట్రేడ్ మార్క్. అనేక రకాల వంటలను చెట్టినాడ్ స్టైల్లో కారంగా మరియు రుచికరంగా తయారుచేస్తారు. చెట్టినాడ్ రిసిపిలకు ఒక్క తమిళ నాడులోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాలు లేదా ప్రదేశాల్లో కూడా చాలా ఫేమస్.

ఇండియన్ సబ్ కాంటినెంట్ రిసిపిలలో చెట్టినాడ్ వంటలు కారంగా మరియు చాలా రొమాంట్ కుషన్ గా ఉంటుంది . చెట్టినాడ్ స్టైల్లో వివిధ రకాలా శాకాహార వంటలు, మాంసాహార వంటలను తయారుచేస్తారు.అయితే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ చెట్టినాడ్ నాన్ వెజ్ ఫిష్ కర్రీని పరిచయం చేస్తున్నాం...

Chettinad Style Fish Curry Recipe

కావల్సిన పదార్థాలు:

మక్కరేల్ చేపలు: 5-6 ముక్కలు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చింతపండు: 1tbsp
పసుపు: 1tsp
కొత్తిమీర తరుగు: 1tbsp (తరిగినది)
నూనె: ½tsp
ఫ్రై చేయడానికి:
మెంతుల్లో: 1tsp
ఆవాలు: ½ tsp
చిన్న ఉల్లిపాయలు: 7-8
వెల్లుల్లి రెబ్బలు: 5-6
టమోటో: 1
కరివేపాకు: కొద్దిగా
ఆయిల్: 2tbsp
మసాలా కోసం:
సోంపు: 1tsp
కొబ్బరి: ¼cup
ఎండు కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా మసాలా కోసం తీసి పెట్టుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, చింతపండు వేసి నానబెట్టుకోవాలి. అందులో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2నిముషాలు మీడియం మంట మీద వేగించాలి. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, వీటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు మిగిలిన నూనె ఫ్రైయింగ్ పాన్ లో వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ మరియు కరివేపాకు వేసి 3 నిముషాలు వేగించుకోవాలి. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించాలి. టమోటో మెత్తగా వేగిన తర్వాత అందులో మసాలా పేస్ట్, పసుపు, చింతపండు పులుసు మరియు సాల్ట్ వేసి అన్నింటిని మిక్స్ చేస్తూ మొత్తాన్ని కొద్దిసేపు వేగించుకోవాలి.
6. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, ఉడికించాలి. 15 నిముషాలు ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు వేసి, నిదానంగా కలుపుకోవాలి. చేపలు చాలా త్వరగా ఉడికుతాయి. మరియు ఉడికేటప్పుడు చాలా నిధానంగా కలుపుకోవాలి. లేదంటే అవి త్వరగా విరిగిపోతాయి. అంతే చేపముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత, గ్రేవీ చిక్కబడ్డ తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి అంతే చెట్టినాడ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.

English summary

Chettinad Style Fish Curry Recipe

Chettinad style recipes are a trademark of Tamil Nadu. Many Tamil recipes are prepared in the spicy and delicious chettinad style. Chettinad cuisine is not only famous in Tamil Nadu but also in other parts of the country.
Story first published: Tuesday, April 15, 2014, 12:40 [IST]
Desktop Bottom Promotion