For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ ఆఫ్ఘనీ : స్పైసీ ట్రీట్

|

పేరు వింటనే చికెన్ లవర్స్ కు నోట్లో నీరు ఊరాల్సిందే. ఎందుకంటే ఆఫ్ఘన్ రుచులంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మరియు ఈ ఆఫ్ఘన్ రుచులను చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ వంటలు ఒరిజినల్ గా ఆఫ్ఘన్ నుండి వచ్చినవి. అయితే మన ఇండియాలో చాలా అద్భుతంగా ప్రయోగం చేసి మన ఇండియన్ వంటకే ఆఫ్ఘన్ రుచులను తీసుకొచ్చారు.

ఈ ఆఫ్ఘన్ చికెన్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరియు చాలా సింపుల్ కూడా. ఎందుకంటే, ఈ చికెన్ రిసిపికి ప్రధానంగా పెరుగు మరియు కొన్ని రకాల సుగంధ మసాలా దినుసులతో మ్యారినేట్ చేయడమే ఈ వంట యొక్క ప్రత్యేకత. ఈ ఆఫ్ఘన్ చికెన్ రిసిపికి మసాలాలతో పాటు, కారం కూడా పట్టించడం వల్ల చాలా టేస్టీగా మరియు స్పైసీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ స్పైసీ ట్రీట్ ను ఎంజాయ్ చేయాలంటే ఎలా తయారుచేయాలో చూడాల్సిందే...

Chicken Afghani: A Spicy Treat

కావల్సినపదార్థాలు:
చికెన్ 1kg (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నిమ్మరసం: 1tbsp
బ్లాక్ జీలకర్ర: 1tsp
యాలకులు: 4
బే ఆకులు: 2
దాల్చిన చెక్క 1
కారం: 1tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా ½ tsp
కుంకుమపువ్వు కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీరు 1 cups
కొత్తిమీర: మ్యారినేషన్ కొరకు
చిక్కటి పెరుగు: 1cup
ఉల్లిపాయ పేస్ట్: 3tbsp
జీడిపప్పు: 2tbsp
వైట్ నువ్వు గింజలు: 2tbsp
వెల్లుల్లి కోసం (అలంకరించు కోసం తరిగిన,): 2tsp
వెల్లుల్లి రెబ్బలు: 4
జాజికాయ పొడి: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
2. తర్వాత జీడిపప్పు, నువ్వులు, వెల్లుల్లి నట్ మగ్ ను జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఈ పేస్ట్ తో పాటు, ఉల్లిపాయపేస్ట్, పెరుగు, నిమ్మరసం కూడా చేర్చి బాగా మిక్స్ చేసి, చికెన్ ముక్కలకు పట్టించి మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. మూడు గంటల తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో దాల్చిన చెక్క, యాలకులు, బిర్యాని ఆకు, జీలకర ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో నిముషం వేయించుకోవాలి.
6. ఇప్పుడు, మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి మరో 15నిముషాలు మీడి మంట మీద వేయించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
7.ఇప్పుడు అందులో ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం కూడా వేసి మిక్స్ చేసి మరో రెండు నిమషాలు ఉడికించాలి.
8. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 20-25నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
9. చికెన్ ఉడికిందో లేదో నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
10. చివరగా చికెన్ కొత్తిమీర తరుగు మరియు కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి చికెన్ ఆఫ్ఘని రెడీ.

English summary

Chicken Afghani: A Spicy Treat

The name of this chicken recipe is enough to make chicken lovers hungry. As the name suggests, the recipe originally hails from Afghanistan but since we Indians are good experimenters, we have improvised this chicken recipe according to our tastes and preferences.
Story first published: Wednesday, February 5, 2014, 17:59 [IST]
Desktop Bottom Promotion