For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ బటర్ మసాలా తక్కువ కారం -ఎక్కువ రుచి

|

కొన్ని వంటలు మనం మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటాయి. అటువంటి వంటకాల్లో ఉదాహరణకు బట్టర్ చికెన్ ఒకటి. ఈ ఇండియన్ బట్టర్ చికెన్ ను బ్రిటీష్ వారు కూడా తిని తెగ ఎంజాయ్ చేశావారట, అంతటి అద్భుత రుచికలిగినది. అదే విధంగా చికెన్ బటర్ మసాలా రిసిపి కూడా మరింత ఎక్కువ మందికి అత్యంత ఇష్టమైన వంట.

సహజంగా ఇండియన్ చికెన్ కర్రీకీ బటర్ ను ఉపయోగిస్తుంటారు బటర్ చికెన్ లాగా ఇది స్పైసీగా లేదా తక్కువ కారంతో ఉండదు. అయితే ఇది బటర్ ప్లేవర్ ను అందిస్తుంది. మీడియం స్పైసీగా ఉంటుంది. కారం ఎక్కువగా తినకుండా మీడియం స్పైసీ ఫుడ్స్ ను తినాలనుకునే వారు ఇటువంటి వంటలను ఎంపిక చేసుకొని, ఎంజాయ్ చేయవచ్చు. ఈ బటర్ చికెన్ మసాలా రిసిపిని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Butter Masala: Homemade Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg (బోన్ లెస్)
కారం పొడి: 1tsp
పసుపు పొడి: 1tsp
కస్తూరి మేతి: 4tbsp
తాజా క్రీమ్: 1cup
అల్లం: 1 ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4tbsp
బట్టర్: 100grms
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటాలు: 4(పేస్ట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చికెన్ ముక్కలు వేసి తక్కువ మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత, అందులో బటర్ వేయాలి.
4. తర్వాత, అందులో టమోటో గుజ్జును వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మరో 5 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో కారం, పసుపు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని వేగిస్తూ ఉండాలి. చికెన్ నుండి నూనె పైకి తేలే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే కస్తూరి మేతి చిన్న ముక్కలుగా కట్ చేసి చిలకరించుకోవాలి.
7. చివరగా తాజా క్రీమ్ ను కూడా జోడించి, అల్లం ముక్కలు లేదా అల్లం తురుమును వేసి మూత పెట్టి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.

English summary

Chicken Butter Masala: Homemade Recipe


 Some dishes are so famous that they become legendary. For example, butter chicken was invented so that the Britishers could enjoy the Indian chicken curry with having their tongues burned with spices. Similar, chicken butter masala recipe is another adaptation of the same recipe that is more adaptable to the Indian palate.
Story first published: Friday, September 12, 2014, 13:18 [IST]
Desktop Bottom Promotion