For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ చికెన్ చాప్ : బిర్యానీ కాంబినేషన్ రిసిపి

|

చికెన్ చాప్ వెరైటీ చికెన్ డిష్ . ఇది బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ . అయినా,ఈ క్లాసిక్ ఇండియన్ ఫుడ్ రిసిపి. ఈ డ్రైచికెన్ రిసిపి బిర్యానీకి మంచి కాంబినేసన్ . బోన్ లెస్ చికెన్ తో తయారుచేసి ఈ చికెన్ చాప్ తయారుచేయడం చాలా సులభం మరియు ఈ వంటకు ఉపయోగించే మసాలా దినుసులు కరెక్ట్ గా వేయడం వల్ల మరింత టేస్ట్ గా ఉంటుంది.

తయారుచేసే విధానంలో మ్యారినేషన్ ముఖ్యం. ఒక గంట సేపు మ్యారినేట్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ చాప్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Chaap Very Tasty: Biryani Combination

కావల్సిన పదార్థాలు
చికెన్ : 500grm (బోన్ లెస్ )
ఉల్లిపాయలు 4 (పేస్ట్)
వెల్లుల్లి రెబ్బలు: 6-8 పేస్ట్ చేసుకోవాలి
పచ్చిమిర్చి: 4 (పేస్ట్)
పెరుగు: 1cup
కారం: 1tbsp
గరం మసాలా (మిరియాలు, స్టార్ సొంపు, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క): 1tsp
జాజికాయ పొడి: 1tsp
కొబ్బరి (భూమి) 1tbsp
ఆవాల నూనె 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను మ్యారినేట్ చేసుకోవాలి.
2. అందుకోసం ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి అన్నింటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పెరుగును బాగా చిలికించి పెట్టుకోవాలి. తర్వాత పెరుగు వడగట్టుకొని, నీరు మొత్తం తీసేయాలి.
3. ఇప్పుడు పై తెలిపిన పదార్థాలు మరియు పెరుగుతో చికెన్ మ్యారినేట్ చేసి రిఫ్రిజరేటర్లో 1 గంట పాటు ఉంచుకోవాలి.
4. డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, ఈ బెంగాల్ రిసిపికి మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. ఈస్ట్రాంగ్ స్మెల్ ఇష్టం లేని వారు సాధారణ కుక్కింగ్ ఆయిల్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
5. నూనె కాగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ వేసి, 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ క్రిస్పీగా ఉంటుంది .
6. మద్యమద్యలో కలియబెడుతూ మీడియం మంట మీద 10 నిముసలు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలుతూ ఉడికేటప్పుడు చికెన్ ఘుమఘమలాడే వాసన వస్తుంది.
7. ఇప్పుడు అందులో నీళ్ళు పోసి కలియబెట్టుకొన్ని 25 నిముసాలు చికెన్ ను ఉడికించుకోవాలి. నీరు పూర్తిగా డ్రై అయ్యే వరకూ చికెన్ ను ఉడికించుకోవాలి. అంతే చికెన్ చాప్ రెడీ. దీన్నిప్లెయిన్ వైట్ రైస్ మరియు రోటీ మరియు బిర్యానీలతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది .

English summary

Chicken Chaap Very Tasty: Biryani Combination

Chicken Chaap Very Tasty: Biryani Combination. You must have heard vaguely about Chicken Chaap as the perfect accompaniment with biriyani. But even on it's own it a classic Indian food recipe. Unfortunately this easy chicken recipe gets overshadowed all the time by its more popular cousin, Biriyani. It is prudent to mention that this spicy chicken dish is not had everywhere with biriyani. It a very region specific Indian food recipe, mainly a Bengali recipe that is popular in the East.
Story first published: Tuesday, September 15, 2015, 13:58 [IST]
Desktop Bottom Promotion