For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ ఎగ్ రోల్ రిసిపి: వింటర్ స్పెషల్

|

రోల్స్ స్నాక్ తయారు చేయడం చాలా సులభం మరియు టేస్టీ డిష్. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీ చికెన్ స్టఫ్డ్ ఎగ్ రోల్స్ ను చికెన్ మరియు ఎగ్ , కొన్ని మసాలా దినుసులతోటి తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ ఎగ్ రోల్స్ తయారు చేయడం చాలా సులభం.

చికెన్ ఎగ్ రోల్ టేస్టీ స్నాక్ రిసిపి . చికెన్ ఎగ్ రోల్ కి కొన్ని వెజిటేబుల్స్ చేర్చడం వల్ల ఇది టేస్టీ అండ్ హెల్తీ డిష్ . వెజిటేరియన్స్ అయితే ఓన్లీ వెజిటేబుల్స్ తోటే తయారుచేసుకోవచ్చు . ప్రిపేర్ చేసే పద్దతి కూడా చాలా సులభం. డైట్ కాన్సియస్ పర్సన్ అయితే, చికెన్ ఎగ్ రోల్ ను డీఫ్ ఫ్రై చేయకుండా, ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఇష్టపడుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెరైటీ చికెన్ స్టప్డ్ బ్రెడ్స్ రోల్స్ ను తయారు చేయండి..

Chicken Egg Roll Recipe

కావల్సిన పదార్థాలు:
  • చికెన్: 250g
  • గుడ్లు - 2
  • ఉల్లిపాయలు - 1 cup
  • క్యాబేజ్ - 1 cup
  • క్యారెట్ - 1 cup
  • అల్లం వెల్లుల్లిపేస్ట్ - 1/4th teaspoon
  • సోయా సాప్ - 1/2 teaspoon
  • చిల్లీ సాస్ - 1/2 teaspoon
  • గరం మసాలా - 1/2 teaspoon
  • నిమ్మరసం - 2 teaspoons
  • స్ప్రింగ్ రోల్ వ్రాపర్స్ - 5
  • ఉప్పు : రుచికి సరిపడా
  • నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ మరియు క్యాబేజ్ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే గరం మసాలా, సోయాసాస్, చిల్లీ సాస్, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
3. దీన్ని 10 నిముషాలు వేడి చేయాలి.
4. ఇప్పుడు గ్రైండ్ చేసుకొన్ని చికెన్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి . అందులోనే ఉడ్డు పగులగొట్టి వేసి, బాగా మిక్స్ చేయాలి.
7. ఈ మిశ్రమాన్ని ముందుగా స్టఫ్ కోసం సిద్దం చేసుకొన్న మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవాలి . మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి .
8. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ వ్రాపర్ ను తీసుకొనే ఒక ప్లేట్ లో సర్దాలి.
9. ఈ వ్రాపర్ లో ఒకటి లేదా రెండు చెంచాల చికెన్ స్టఫ్ ను ఫిల్ చేయాలి. తర్వాత దాని మీద మరో వ్రాపర్ ను ప్లేస్ చేసి నీట్ గా కవర్ చేయాలి.
10. ఇప్పుడు మరో పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఈ చికెన్ రోల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత
11. మొత్తం రోల్స్ ను ఒకదానికి తర్వాత ఒకటి డీఫ్ ఫ్రై చేస్తూ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి . అంతే చికెన్ ఎగ్ రోల్స్ రెడీ. . వీటిని చిల్లీ సాస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

Story first published: Wednesday, December 2, 2015, 16:10 [IST]
Desktop Bottom Promotion