For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిప్ చేయ్..టేస్ట్ చేయ్-చికెన్ జల్ ఫ్రాజి: రంజాన్ స్పెషల్

|

చికెన్ జాల్ ఫ్రీజ్ స్పెషల్ రంజాన్ రిసిపి. రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటారు. కాబట్టి నెలరోజుల పాటు ఒక్క స్పెషల్ డిష్ ఉంటే చాలా బాగుంటుందనుకుంటారు. ఇలా కొంచెం వెరైటీగా స్పెషల్ గా వండుకు తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అటువంటి స్పెషల్ డిష్ లలో ఇటువంటి చికెన్ కర్రీలో చాలా స్పెషల్. ఈ వంటకం పాకిస్తాన్ వంటకమైనా..అయితే ఇంట్లో తయారు చేసుకొనే వంటగా ఒక హోం మేడ్ రిసిపిగా కరాచీ నుండి మనకు పరిచయం అయినది. ఈ చికెన్ జాల్ ఫ్రీజ్ ను రంజాన్ స్పెషల్ గా ప్రయత్నించవచ్చు.

ఈ స్పైసీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంటకం యొక్క స్పెషాలిటీ కలర్ క్యాప్సికమ్, ముఖ్యంగా (రెడ్ క్యాప్సికమ్)తో తయారు చేస్తారు. మరియు టమోటోలు ఓరియంటల్ ఫ్లేవర్ ను ఇస్తుంది. ఈ స్పెషల్ చికెన్ రిసిపి మన సాధరణ చికెన్ వంటకాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, ఈ రంజాన్ వేళ మీరు ట్రై చేయండి..లిప్ చేయండి..టేస్ట్ చేయండి..ఎంజాయ్ చేయండి..

Chicken Jalfrezi: Ramzan Special

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500 గ్రాముల (మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2tsp
పసుపు : 1tsp
ఉల్లిపాయలు: 2(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: చిటికెడు(తురుముకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4(చిన్న ముక్కలుగా తరిగుకోవాలి)
బెల్ పెప్పర్: 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 2 (ముక్కలుగా చేయాలి)
పచ్చిమిరపకాయలు: 4 (మద్యకు కట్ చేయాలి)
గరం మసాలా: 1tsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 4కొమ్మలు(గార్నిష్ కోసం)

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, వేసి బాగా మిక్స్ చేసి, అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలగలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలకు చిన్న చిన్న పొడవాటి గాట్లు పెట్టడం వల్ల మసాలా బాగా పడుతుంది.

2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి, అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కవేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి తురుము వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.

3. ఇప్పుడు మ్యారినేట్ చేసిన పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి మరో 5-7నిముషాలు వేగించుకోవాలి. తర్వాత మంటను తగ్గించి, చికెన్ ను నిదానంగా వేగించుకోవడం వల్ల అవి క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్ లోకి మారుతాయి.

4. తర్వాత అందలోనే పచ్చిమిర్చి ముక్కలు, బెల్ పెప్పర్(క్యాప్సికమ్ )ముక్కలు కూడా వేసి, మరికొద్ది నిముషాలు వేగించుకోవాలి.

5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, ఉప్పు మిక్స్ చేసి, మరో ఐదునిముషాలు వేగించడం వల్ల టమోటో మెత్తబడుతుంది.

6. ఇప్పుడు ఈ గ్రేవీ మీద గరం మసాలా పౌడర్ వేసి, మీడియం మంట మీదు మరో ఐదు నిముషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు కలుపుకొని మూత పెట్టి మరో 5నిముషాలు ఉడివేకించుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో చికెన్ జాల్ ఫ్రిజ్ ను కూడా గార్నిష్ చేసి, క్రిందికి దింపుకొని వేడి వేడిగా పులావ్ లేదా రోటీలతో సర్వ్ చేసి రంజాన్ వేళ ఎంజాయ్ చేయండి...

English summary

Chicken Jalfrezi: Ramzan Special

Chicken Jalfrezi is a special recipe for Ramzan. The Holy month of Ramadan is just about to start and you surely would like to start with some special dishes. Chicken Jalfrezi is one such exotic chicken curry recipe.
Desktop Bottom Promotion