For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇరానీ స్పెషల్ చికెన్ కబాబ్ : రంజాన్ స్పెషల్

|

రంజాన్ నెల నిధానంగా ముగియవస్తోంది. నెల మొత్తం డిఫరెంట్ నాన్ వెజ్ రుచులను టేస్ట్ చూడటం ఒక ఎత్తైతే. ఇఫ్తార్ రోజున తయారుచేసే వంటలకు మరో ప్రత్యేకత. చాలా స్పెషల్ గా ఇఫ్తార్ విందును స్నేహితులకు, ఆత్మీయులకు, బందువులకు అంధిస్తారు. ఆర్డినరీగా తయారుచేసే వంటలకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లను ఈ ఇఫ్తార్ విందులో చాలా మంది ఇష్టపడుతారు.

మరి ఇఫ్తార్ స్పెషల్ గా ఒక స్పెషల్ కబాబ్ రిసిపిని మీకోం ఇక్కడ అందిస్తున్నాం. ఇరానీ స్పెషల్ కబాబ్ రిసిపి ఇది . తయారుచేయడం చాలా సులభం. మరియు చాలా సింపుల్ గా తయారయ్యే ఈ కబాబ్ రిసిపిలంటే చాలా పాపులర్. నాన్ వెజ్ వంటలను ఇష్టపడే వారికి ఈ కబాబ్ రిసిపి ఒక స్పెషల్ ట్రీ. మరి ఈ స్పెషల్ ఇరానీ చికెన్ కబాబ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Kebab: Iranian Recipe For Ramadan

కావల్సిన పదార్థాలు:
చికెన్ ఛాతీ(చికెన్ బ్రెస్ట్): 1kg (స్కిన్ లెస్, క్యూబ్స్ గా కట్ చేయాలి)
ఉల్లిపాయ: 1 (తురుముకోవాలి)
నిమ్మరసం: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాల పేస్ట్: 1tsp
మిరియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
కుంకుమపువ్వు: చిటికెడు
వెచ్చని నీళ్ళు: 3tbsp
ఆలివ్ చమురు: 4tbsp
స్కీవర్స్(Skewers )

తయారుచేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయ తురుమును మిక్సీలో వేసి, అందులోనే నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు పెప్పర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత నీటిలో కుంకుమ పువ్వు వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలకు జీలకర్రపొడి, పెప్పర్ పైడర్, ఆవాలపేస్ట్, గ్రైండ్ చేసుకొన్న మిశ్రమం మరియు కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేసి 8గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. లేదా రిఫ్రిజరేటర్ లో ఉంచాలి.
5. 8గంటల తర్వాత ఫ్రిజ్ లో నుండి చికెన్ బయటకు తీసి మెటల్ స్కీవర్స్ కు గ్రుచ్చాలి.
6. తర్వాత చికెన్ స్కీవర్స్ ను గ్రిల్లో పెట్టి చికెన్ పూర్తిగా ఉడికే వరకూ బేక్ చేయాలి. అంతే ఇరానీ చికెన్ కబాబ్ రిసిపి రెడీ .
ఈ స్పెషల్ రంజాన్ కబాబ్ రిసిపిని టేస్ట్ చూసి ఎంజాయ్ చేయండి.

English summary

Chicken Kebab: Iranian Recipe For Ramadan

Ramadan is slowly drawing to a close but the frenzy for the delectable foods remains the same. So, what are your plans to cook for Iftar today? It would be a good idea to try something out of the ordinary and give your family members a nice surprise.
Story first published: Thursday, July 17, 2014, 13:01 [IST]
Desktop Bottom Promotion