For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చికెన్‌ పకోడి: స్పెషల్ డిన్నర్ డిష్

|

కావలసిన పదార్థాలు :

బోన్‌లెస్‌ చికెన్‌: 1/2kg
పుదీనా: 1 కట్ట
కొత్తిమీర: 1 కట్ట
పచ్చిమిర్చి: 4
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి: 6 రెబ్బలు
నిమ్మకాయ: 1
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1tsp
పెరుగు: 2tsp
శనగపిండి: 1/2cup
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

Chicken Pakoda: Specil Dinner Dish

తయారు చేసే విధానం :
1. ముందుగా పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.
2. తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, ముందుగా నూరిపెట్టుకున్న పుదీన, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా మిక్స్ చేయాలి. 3. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.
4. ఒక గంట తర్వాత అందులో ఒక స్పూను వేడి నూనె, శనగపిండి కలపాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ నుండి కొద్దికొద్దిగా తీసి శెనగపిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.
6. కాగిన నూనెలో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీలా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీస్తే చాలు. రుచికరమైన వేడి వేడి చికెన్‌ పకోడీ రెడీ. అంతే ఇది ఈవెనింగ్ స్నాక్ గాను మరియు డిన్నర్ కు సైడ్ డిష్ గాను తింటే బాగుంటుంది.

English summary

Chicken Pakoda: Specil Dinner Dish

Chicken Pakoda: Specil Dinner Dish
Story first published: Wednesday, September 10, 2014, 18:08 [IST]
Desktop Bottom Promotion