For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ పెషావర్ స్పెషల్ ట్రీట్ ఫర్ రంజాన్

|

చికెన్ పెషావర్ చాలా సింపుల్ డిష్. రోజంతా ఉపవాసం ఉండే వారికి ఒక రుచికరమైన ట్రీట్ ఈ చికెన్ పెషావర్. ఎక్కువ శ్రమపడకుండా చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ చికెన్ పెషావర్. చికెన్ ను పెరుగు మరియు ఇతర కొన్ని మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి తర్వాత తయారు చేస్తారు.

నాన్ వెజ్ ప్రియులకు ఈ హైదరాబాద్ టేస్ట్, ఫ్లేవర్ చాలా ఇష్టం అవుతుంది. మరి మీరు ఈ స్పెషల్ చికెన్ పెషావర్ టేస్ట్ చేయాలంటే ఒక సారి ట్రై చేయాల్సిందే. మరి ఈ చికెన్ పెషావర్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం..

Chicken Peshawari

చికెన్: 1kg(పెద్ద ముక్కలుగా కట్)
బంగాళ దుంపలు : 2(dices లోకి కట్)
టమోటాలు: 2(చిన్న ముక్కలుగా తరిగి)
పెరుగు: ½cup
నల్ల మిరియాలు పొడి: 2tsp
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
అల్లం:వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిరపకాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి)
కుంకుమ పువ్వు: ఒక చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కుంకుమపువ్వు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు కూడా వేసి, బాగా మిక్స్ చేసి ఒక గంట పాటు బాగా నానబెట్టాలి.
4. ఒక గంట తర్వాత పాన్ లో నూనె వేసి బంగాళదుంప వేసి 5నిముషాలు ఫ్రై చేయాలి.
5. తర్వాత అందులో టమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, పసుపు, పచ్చిమిర్చి, ఐదు నిముషాల పాటు వేగించాలి.
6. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని చికెన్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి. మీడియం మంట మీద 10నిముషాలు వేగించుకోవాలి. 10నిముషాల తర్వాత అందులో నీళ్ళు ఉప్పు కూడా వేసి, మూత పెట్టి 20నిముషాల పాటు తక్కువ మంట మీద పూర్తిగా ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. ఇలా చేసిన తర్వాత పూత తీసి, ఫోర్క్ తో చికెన్ ఉడికిందో లేదో చెక్ చేయాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే చికెన్ పెషావర్ రెడీ.

English summary

Chicken Peshawari: Treat For Ramzan

Ramzan, the month of fast and feast is here. How about some mouthwatering authentic chicken recipe? Try out the delicious recipe of chicken peshawari . You will definitely be delighted after your whole day of fast.
Story first published: Saturday, July 27, 2013, 14:54 [IST]
Desktop Bottom Promotion