For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ స్పైసీ చికెన్ రోగన్ రిసిపి: మొఘులాయ్ స్పెషల్

|

చికెన్ రోగన్ ఒరిజినల్ రిసిపి కాశ్మిర్ నుండి వచ్చినది. ఇది ఒక కర్రీ రిసిపి ఇది రెడ్ హాట్ రిసిపి . చాలా కారంగా ఉంటుంది. కారంగా ఉండే నాన్ వెజ్ రుచులను తినాలనుకొనే వారు ఇలాంటి వంటలను ఎంపిక చేసుకోవచ్చు. కాశ్మీర్ లోని మొఘులాయ్ వారు దీన్ని పరిచం చేశారు . చికెన్ రోగన్ రిసిపిని చాలా డిఫరెంట్ గా తయారుచేస్తారు. ముందుగానే చికెన్ ను రోస్ట్ చేసి తర్వాత మిగిలిన మాసాలతో ఉడికించడం వల్ల స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది.

ముఖ్యంగా ఈ చికెన్ రోగన్ రిసిపికి కాశ్మీరి రెడ్ చిల్లీ జోడిస్తే మరింత టేస్ట్ గా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Chicken Rogan Josh: A Mughlai Recipe

కావల్సిన పదార్థాలు :
చికెన్ : 1/2kg
ఎండుమిర్చి: 5-6
ఆవాలు: 1tbsp
దాల్చిన రెక్క: కొద్దిగా
గ్రీన్ యాలకలు: 3

READ MORE: చికెన్ తింటే ఆరోగ్యానికి ఒకటి కాదు-రెండుకాదు 11 లాభాలు!

బ్లాక్ యాలకలు: 2
శొంఠిపౌడర్: 1/2tbsp
సోంపుపొడి: 1/2tbsp
కారం: 1tbsp
పసుపు: కొద్దిగా

ఉప్పు: రుచికి తగినంత

నూనె: సరిపడా
నీళ్ళు : అవసరం అయినంత

READ MORE: బోన్ సూప్ త్రాగడం వల్ల పొందే 12 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

తయారుచేయు విధానం:
1. ముందుగా ఎండుమిర్చిని నీటిలో వేసి, 5నిముషాల తర్వాత బయటకు తీసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనెవేసి వేడి అయ్యాక అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో పేస్ట్ చేసుకొన్న ఎండుమిర్చి కారం వేసి వేగించుకోవాలి. నిముషం తర్వతా నీళ్లుపోయాలి.
4. తర్వాత అందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్స్ చేసి మంటను కొద్దిగా ఎక్కువగా పెట్టి, ఉడికించుకోవాలి.
5. నీళ్ళు సగం అయ్యే వరకూ ఉడికించుకున్న తర్వాత అందులో ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కల్ని అందులో వేసి మంటను తగ్గించి ఉడికించాలి.
6. ఇది చిక్కగా గ్రేవీలా తయారైన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ కర్రీ వైట్ రైస్ లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Chicken Rogan Josh: A Mughlai Recipe

Rogan josh has its origins in Kashmir, India. It is a chicken curry recipe that is red hot in colour and extremely spicy. Rogan josh was first introduced by the Mughals in Kashmir. Ideal for all non vegetarians chicken rogan josh can be an awesome menu to be served on all occasions.
Desktop Bottom Promotion