For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ స్క్రాబుల్డ్ ఎగ్: స్పెషల్ సైడ్ డిష్

|

బ్యాచులర్స్ లేదా సింగిల్ వర్కింగ్ కప్పుల్స్ కానీ చాలా త్వరగా మరియు సింపుల్ గా తయారుచేసుకొనే వంటకాల్లో ఇది ఒకటి. కొంత మందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం . మాంసాహారం ఇష్టమైన వారు, ఇలా ఫాస్ట్ రిసిపిలను తయారుచేసుకోవచ్చు.

ఈ స్పెషల్ స్క్రాబుల్డ్ ఎగ్ రిసిపికి గుడ్డు లేదా వెజిటేబుల్స్ జోడించి తయారుచేసుకోవచ్చు. లేదా చికెన్ తో కూడా తయారుచేసుకోవచ్చు. చికెన్ స్క్రాబుల్డ్ ఎగ్ కు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మరియు పచ్చిబఠానీలు జోడించి తయారుచేస్తే మరింత టేస్ట్ గా ఉంటుంది.

చికెన్ స్క్రాబుల్డ్ ఎగ్ ను తయారుచేసుకోవడం చాలా సులభం. ఇది చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ నాన్ వెజ్ సైడ్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Scrambled Eggs:Special side Dish

ఎముకలు లేని చికెన్: ½cup(ఉడికించిన మరియు పేలికలుగా)
గుడ్లు: 4-6
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటోలు: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
బ్లాక్ మిరియాలు పొడి: 2 tbsp
ఛాట్ మసాలా: 1tsp
పాలు: 1cup
తురిమిన చీజ్: ½ cup(అవసం అయితేనే)
ఉప్పు: రుచికి సరిపడా
గార్నిష్ కోసం
టమోటాలు: 1
ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: ½cup
ఆలివ్ నూనె: ½cup (గార్నిష్ కోసం)

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక టీస్పూన్ నూనె పాన్ లో వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ మరియు పచ్చిబఠానీలు వేసి 3 నిముషాలు ఫ్రై చేయాలి.
2. తర్వాత అందులో చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉప్పు, పచ్చిమిర్చి, మరియు టమోటోలు వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. అంతలోపు గుడ్డును ఒక గ్లాస్ లో వేసి, అందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి, ఒక చెంచా పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రైయింగ్ పాన్ లో వేయాలి.మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, అలా చేయడం వల్ల ఎగ్ వైట్ మొత్తం స్క్రాబుల్ అవుతుంది.
5. అవసరం అయితే మరో సైడ్ త్రిప్పి కాల్చుకోవాలి. తర్వాత చీజ్ ను స్ప్రెడ్ చేయాలి మరియు ఛాట్ మసాలను చిలకరించాలి అంతే చికెన్ స్క్రాబుల్డ్ ఎగ్ రిసిపి రెడీ. దీన్ని టమోటోలు, ఉల్లిపాయలు మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Chicken Scrambled Eggs:Special side Dish

From working couples to single men to house wives, most of the non-vegetarians always pick up eggs with their lousy eyes to prepare breakfast. You can make the plain scrambled eggs with just eggs or add few vegetables like onions, green chillies and peas. How about using the leftover chicken that you prepared last night?
Story first published: Wednesday, February 4, 2015, 12:29 [IST]
Desktop Bottom Promotion