For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ షాకూటి రిసిపి : నాన్ వెజ్ స్పెషల్

|

నాన్ వెజ్ వంటల్లో చికెన్ షాకూటి ఒక టేస్టీ అండ్ స్పైసీ రిసిపి. ముఖ్యంగా దీన్ని గోవా ప్రాంతంలో ఎక్కువగా తయారుచేస్తుంటారు. గోవాన్ కుషన్స్ లో చికెన్ షాకుటి చాలా ఫేమస్ డిష్ .

ఈ వంటకు స్పెషల్ గా కాశ్మిర్ రెడ్ మిర్చి లేదా గుంటూర్ మిర్చిని జోడించి, వీటితో పాటు మరికొన్ని ఇండియన్ మసాలా దినుసులను జోడించి తయారుచేస్తుంటారు. ఈ గోవా స్పెషల్ రిసిపి రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ . మరి ఈ స్పెషల్ నాన్ వెజ్ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Shakooti Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
లవంగాలు: 6
బ్లాక్ పెప్పర్: 10
ఎండు మిర్చి : 20(మీకు కారం ఎక్కువగా ఉండాలంటే)
దాల్చిన చెక్క: చిన్న ముక్క
నూనె: 1/2cup
అల్లం-వెల్లుల్లిపేస్ట్: 1tbsp
ధనియాలు: 1tbsp
పసుపు: 1/2tsp
యాలకలపొడి: 1/2tsp
మెంతులు: 1/4tsp
కొబ్బరి : 2tbsp
వేగించిన ఉల్లిపాయలు: 3tbsp(పేస్ట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1 1/2tsp
గసగసాలు: 1 1/2tsp
నీళ్ళు సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఎండు మిర్చిని నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
2. తర్వాత లంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, మెంతులు, కొబ్బరి, జీలకర్ర మరియు గసగసాలు, వేసి మొత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు నీటిలో నానబెట్టుకొన్న పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
5. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగానే అందులో పసుపు, ఉప్పు, కారం పేస్ట్, మరియు మసాలా పేస్ట్ ను కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. మసాలాలను పూర్తిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే చికెన్ కూడా వేసి ఆయిల్ తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి
8. చికెన్ వేగిన తరవ్ాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో యాలకలపొడి, ఫ్రైచేస, గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ మరియు నిమ్మరసం వేసి మూత పెట్టి 5నిముషాలు సిమ్ లో ఉడికించుకోవాలి .
10. పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

English summary

Chicken Shakooti Recipe

Try this chicken recipe. It is a great alternative to the regular chicken dishes and the taste is amazing. This spicy and flavorful chicken shakooti is best served with naan and rice and rotis..
Story first published: Tuesday, February 3, 2015, 13:15 [IST]
Desktop Bottom Promotion