For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరైటీ చికెన్ స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్

|

రోల్స్ స్నాక్ తయారు చేయడం చాలా సులభం మరియు టేస్టీ డిష్. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీ చికెన్ స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్ ను చికెన్ కొన్ని మసాలా దినుసులతోటి తయారు చేసుకోవచ్చు.

ఈ చికెన్ బ్రెడ్ రోల్స్ తయారు చేయడం చాలా సులభం. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఇష్టపడుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెరైటీ చికెన్ స్టప్డ్ బ్రెడ్స్ రోల్స్ ను తయారు చేయండి..

Chicken Stuffed Bread Rolls

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్: 100grms(ఉడికించి, మెత్తగా చేసుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1/2tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాలపొడి: 1/2tsp
గరంమసాలా: 1/2tsp
ఉప్పు: తగినంత
కోడిగుడ్లు: 2
బ్రెడ్ క్రంబ్స్: 1cup
నిమ్మరసం: 2tsp
బంగాళదుంప: 1(ఉడికించి, మెత్తగా చేయాలి)

తయారు చేయు విధానం:
1. ఒక పాత్రలో ఉడికించిన బోన్‌లెస్ చికెన్, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటసేపు ఊరనివ్వాలి.

2. స్టౌ మీద బాణలి ఉంచి వేడ య్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. చికెన్ మిశ్రమం వేసి బాగా వేయించాలి.

3. మిశ్రమం బాగా దగ్గరపడ్డాక, బంగాళదుంప ముద్ద వేసి కలపాలి.

4. తర్వాత బ్రెడ్ అంచులను కట్ చేసి, నీటితో కొద్దిగా తడి చేయాలి.

5. ముందుగా తయారు చేసి ఉంచుకున్న మిశ్రమం బ్రెడ్ మీద ఉంచి రోల్ చేయాలి.

6. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి గిలక్కొట్టి ఒక ప్లేట్‌లో పోయాలి.

7. మరో ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్ వేయాలి.

8. బ్రెడ్ రోల్స్‌ని ముందుగా కోడిగుడ్డు సొనలో దొర్లించి ఆ తరువాత బ్రెడ్‌క్రంబ్స్ పొడిలో దొర్లించాలి.

9. స్టౌ మీ పాన్ ఉంచి అందులో నూనె పోసి కాగాక, వీటిని ఒక్కటొక్కటిగా వేస్తూ చిన్నమంట మంట మీద వేయించాలి. బాగా వేగాక తీసి, సాస్‌తో కాని, చట్నీతో కాని సర్వ్ చేయాలి.

English summary

Chicken Stuffed Bread Rolls

These take a little while to make but are worth the effort. A homemade bread roll has a spicy chicken filling which is great for packed lunches or picnics.
Story first published: Thursday, July 4, 2013, 17:38 [IST]
Desktop Bottom Promotion