కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 4-6(ఉడికించి పై పొట్టు తీసినవి)
పండు మిర్చి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2tsp
అల్లం: చిన్న ముక్క(పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-8(సన్నగా తరిగినవి)
చింతపండు గుజ్జు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు: 1/2cup
వంటసోడా: చిటికెడు
సోయా సాస్: 2tsp
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. పాన్ లో నూనె పోసి వేడయ్యాక గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.
3. ఇప్పుడు అందులోనే పండుమిర్చిపేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాలు పాటు వేయించాలి.
4. దానికి సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించి స్టౌ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. అంతే చిల్లీ ఎగ్స్ రెడీ ఇది చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి చాలా మంచి కాంబినేషన్. ఎగ్ ఇష్టపడని వారు గుడ్డుకు ప్రత్యామ్నాయంగా బంగాళదుంపలను ఉపయోగించి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు.