For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిల్లీ క్రాబ్(పీతలు)రిసిపి-సింగపూర్ స్పెషల్ డిష్

|

చిల్లీక్రాబ్ రిసిపికి ఉపయోగించి వస్తువులు చాలా సాధారణమైనవి. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే పదార్థాలు. ఈ చిల్లీ క్రాబ్ రిసిపి సింగ్ పూర్ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంట. చిల్లీక్రాబ్ రిసిపి మరింత రుచికరంగా ఉండటానికి టమోటో పూరి, చిల్లీ సాస్ ను ఉపయోగిస్తారు. దాంతో మంచి టేస్ట్ తో పాటు మంచి ఫ్లేవర్ కూడా.

మాంసాహార ప్రియులు ఇటువంటి వంటకాలను కూడా టేస్ట్ చేయవచ్చు. రుచికరంగా ఉండే ఈ చిల్లీ క్రాబ్ రిసిపిన సింగపూర్ స్టైల్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే...దీన్ని ట్రై చేయాల్సిందే...

Chilli Crab

పీతలు: 2పెద్దవి(చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
చిల్లీస్: 3-4
వెల్లుల్లి రెబ్బలు: 4-5(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం తరుము: 1tbsp
స్ప్రింగ్ ఉల్లిపాయలు:1cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్: 1tsp
టమోటా గుజ్జు :1cup
చక్కెర: 1tsp
వెజిటేబుల్ ఆయిల్: 4-5tbsp
ఉప్పు : రుచికి సరిపడేలా
కొత్తిమీర తరుగు: 1cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి, నూనె వేసి వేడిచేయాలి.
3. తర్వాత తర్వాత అందలో వెల్లుల్లి ముక్కలు, అల్లం తురుము వేసి తక్కువ మంట మీద 1-2నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. వెల్లుల్లి, అల్లం తురుము బ్రౌన్ కలర్ లోకి మారగానే, అందులో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బ్లాక్ పెప్పర్, మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. స్రింగ్ ఆనియన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత, ఇప్పుడు అందులో క్రాబ్స్(చిన్న ముక్కలుగా చేసుకొన్న పీతలు)కూడా వేసి 5నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
6. పీతలు వేగుతుండగా అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ను, టమోటో పూరీ(గుజ్జు)మరియు పంచదార కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, మిశ్రమాన్నంతటిని ఒక సారి కలగలిపి, తక్కువ మంట పెట్టి 10నిముషాలు పాటు ఉడికించుకోవాలి.
8. సాస్ లేదా గ్రేవీ చిక్కబడే సమయం చూసుకొని, చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే క్రాబ్ (పీతల)రిసిపి రెడీ.

Story first published: Monday, September 2, 2013, 16:35 [IST]
Desktop Bottom Promotion