For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోఫ్యాట్ -లోకాలరీ స్ట్రాంగ్ ఫ్లేవర్-చిల్లీ ప్రాన్స్

|

సీఫుడ్స్ లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలతో ఎన్నో రుచులు తయారుచేవచ్చు. అందులో ఫ్రై చేసిన రొయ్యల రుచే వేరు. రొయ్యల గ్రేవి, గ్రిల్డ్ ప్రాన్స్, ప్రాన్స్ బిర్యానీ , బటర్ ఫ్రైడ్ ప్రాన్స్ ఒలా ఒకటేమిటి ఆహా..రకరకాల రుచులను తయారు చేసుకోవచ్చు.

చిల్లీ ప్రాన్స్ ను తయారు చేయడం చాలా సులభం. మరియు టేస్టీ కూడా. ఈ టేస్టీ మరియు సులభమైన వంటకం రుచి మాత్రమే కాదు లోక్యాలరీ ఫుడ్ మరియు లోఫ్యాట్. ఇంకా విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారం. ఈ చిల్లీ ప్రాన్స్ ను వేడి వేడి వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ కు బాగా నప్పుతుంది. ఈ స్పైసీ ఫ్లేవర్డ్ వంటకం ప్రోటీన్ ప్యాక్ తో నిండి ఉండటం వల్ల మెటబాలిజం(జీవక్రియలను)కావల్సిన శక్తిని అంధిస్తుంది. మరీ మీరూ ఈ లోఫ్యాట్ మరియు లో కాలరీ ఫుడ్ ఇంట్లో ట్రై చేయండి..

కావల్సిన పదార్థాలు:
రొయ్యలు: 1kg
వెల్లుల్లిపాయ: 1
పచ్చిమిరపకాయలు: 6
కొత్తిమీర: 2కట్టలు
అజీనమోటో పౌడర్: 1tsp
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
గుడ్డు: 1
మైదా: 3tbsp
కార్న్ ఫ్లోర్: 3tbsp
అల్లం, వెల్లుల్లి: 2tbsp
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా రొయ్యల్ని పొట్టు తీసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే కొత్తిమీర తరుగు, కారం, అజీనమోటో పౌడర్, ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి.
4. ఇలా వేగిన మసాలా ముద్దని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరో గిన్నెలోకి కొద్దిగా అజినీమోటో పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, మైదా పిండి, మొక్కజొన్నపిండి(కార్న్ ఫ్లోర్) తీసుకొని కలపాలి.
6. అందులోనే రొయ్యలు కూడా వేసి బాగా కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడెక్కాక ఈ రొయ్యల్ని అందులో ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
7. ఇలా వేయించిన రొయ్యల్ని ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలాలో కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి, మీడియం మంట మీద బాగా ఉడికించాలి.
8. బాగా దగ్గరయ్యాక కొద్దిగా మిరియాలపొడి వేసి దించేయాలి. అంతే చిల్లీ ప్రాన్స్ రెడీ..

English summary

Chilli Prawns-Special Sea Food Recipe | చిల్లీ ప్రాన్స్-సీ ఫుడ్ స్పెషల్

Dine on a filling, spicy pasta dish that will impress any dinner guest. A delicious spicy king prawn dish bursting with flavour. High in protein and packed with chilli to boost your metabolism. Best served with white/brown rice or noodles.
Desktop Bottom Promotion