For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మొరాకో చికెన్ వంటకం: క్రిస్మస్ స్పెషల్

|

క్రిస్మస్ చాలా దగ్గరలో రాబోతోంది. క్రిస్మస్ రోజున వివిధ రకాల నాన్ వెజ్ వంటలు, కేక్స్, వైన్స్ తో ప్రతి ఇంట్లో అథితులు, కుటుంబ సభ్యులతో సందడి సండదిగా ఉంటుంది. అంతక ముందే క్రిస్మస్ రోజును ఏ వంటలు చేయాలి. అందుకు అవసరం అయ్యే వస్తువులేంటే, డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ఎలా డెకొరేట్ చేయాలని, అప్పుడే పనులు చకచక మొదలెట్టేసి ఉంటారు. అయితే, డిన్నర్ కు తగ్గ నాన్ వజ్ వంటలు ఈ డైనింగ్ టేబుల్ మీద చేరిప్పుడే పూర్తిగా అలంకరణగా కనబడుతుంది. చికెన్ యూనివరల్స్ నాన్ వెజిటేరియన్ ఐటమ్. ఎందుకంటే, మాంసాహార ప్రియులందరు తప్పక చికెన్ వంటలను ఎక్కువగా ఇష్టపడుతారు.

ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఆఫ్రికన్ దేశంలో మొరాకో ప్రాంతం యొక్క కొత్త రుచిని మీకోసం పరిచయం చేస్తున్నాం. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. ఈ చికెన్ రిసిపికి మొదట కొన్ని మసాలా దినుసులతో మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. మ్యారినేట్ చేసిన చికెన్ ను ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ టేస్టీ చికెన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Christmas Spcl

కావల్సిన పదార్థాలు:
ఎముకలు లేని చికెన్ బ్రెస్ట్: 2
మిరియాలు : 10
చెక్క: 1
ఉల్లిపాయ: 1 (కట్ చేసుకోవాలి)
అల్లం: 1(మీడియం సైజ్ ముక్క)
వెల్లుల్లి రెబ్బలు: 5 (తరిగినవి)
కొత్తిమీర : (తరిగినవి)
నిమ్మతొక్క : ¼ tsp (తురిమినది)
బ్లాక్ పెప్పర్ పౌడర్: ½tsp
నిమ్మరసం : 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఎండుమిర్చి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 1tbsp
ఆలివ్: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ బ్రెస్ట్ ను శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు, మిరియాలు, చెక్క, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, లెమన్ జెస్ట్(నిమ్మతొక్క), నిమ్మరసం అన్నింటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ తయారుచేసుకోవాలి.
3. తర్వాత ఈ పేస్ట్ కు ఎండు మర్చి, ఉప్పు, రోస్ట్ చేసిన జీలకర్రపొడి మరియు పెప్పర్ పౌడర్ ను కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత చికెన్ బ్రెస్ట్ మీద అడ్డంగా కత్తితో గాట్లు పెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ ను ఈ చికెన్ బ్రెస్ట్ కు మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత, పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో అందులో మ్యారిచేట్ చేసి పెట్టుకొన్న చికెన్ స్లైస్ ను వేయాలి.
6. మంటను మీడియంగా పెట్టి 15-20నిముషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7. రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ కి మార్చుకోవాలి. తర్వాత ఆలివ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్పైసీ మొరాకో చికెన్ వంటకం రెడీ.

English summary

Christmas Spcl: Spicy Moroccan Chicken Recipe

Christmas is just round the corner. While you are all gearing up with the cleaning and decorations, the grand Christmas dinner will also pop up in your mind. Getting the best recipes on the Christmas dinner table is an absolute must.
Story first published: Tuesday, December 17, 2013, 16:14 [IST]
Desktop Bottom Promotion