For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకనట్ మటన్ కర్రీ -స్పైసీ అండ్ టేస్టీ

|

ఇండియాలో మటన్ కర్రీను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల వంటకాలను మసాలా దినుసులు అధికంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇండియాలో కూడా వివిధ స్టేట్స్ లో వివిధ రకాలుగా వెరైటీగా వండుతారు. అయితే తయారు చేయడంలో కొన్ని మసాలా దినుసులు చేర్పులు చేసే పద్దతి డిఫరెంట్ గా ఉంటుంది.

మన సౌత్ ఇండియన్ వంటకాల్లో తప్పనిసరిగా కొబ్బరి మరియు కరివేపాకు ఉపయోగిస్తారు. ఈ రెండు వస్తువులను మన వంటకాల్లో సులభంగా కనిపెట్టేయవచ్చు. ఇవి వంటల్లో చేర్చడం వల్ల మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మరి ఈ కోకోనట్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం..

Coconut Mutton Curry Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్ : 500gms(మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా కొబ్బరి : ½cup(తురుము)
ఉల్లిపాయలు : 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటాలు : 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tsp
పచ్చిమిరపకాయలు : 3
సోపు గింజలు : 1tsp
దాల్చిన చెక్క స్టిక్ : చిన్న ముక్క
యాలకులు : 2
లవంగాలు : 3
కరివేపాకు : రెండు రెమ్మలు
కారం : 1tsp
పసుపు : 2tsp
దనియాల పొడి : 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్ : 2tbsp
నీళ్ళు: 2 cups
కొత్తిమీర తరుగు : 2tsp (చిన్న ముక్కలుగా తరిగి, అలంకరింపు కోసం)

తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ ను బాగా శుభ్రం చేసి కడిగి నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి కొద్దిగా నీరు పోసి మీడయం మంట మీద 5-6విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
3. మటన్ ఉడికిన తర్వాత స్టౌ ఆప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సోంపు, యాలకులు, నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
5. తర్వాత పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో కరివేపాకు, చెక్క, యాలకులు మరియు లవంగాలు వేసి కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
8. టమోటో మెత్తబడ్డాక అందులో కొబ్బరి మిశ్రమం పేస్ట్ ను వేసి, ధనియాల పొడి, పసుపు, కారం ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగించుకోవాలి.
9. మసాలా అంతా బాగా వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న మటన్ ముక్కలను వేసి, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేయాలి.
10. తర్వాత అరకప్పు నీళ్ళు పోసి పాన్ మూత పెట్టి మరో 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
11. మటన్ మసాలాతో బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే కోకోనట్ మటన్ కర్రీ రెడీ..

English summary

Coconut Mutton Curry Recipe | స్పైసీ కోకోనట్ మటన్ కర్రీ..


 Mutton curries are prepared in various methods in India. Some recipes are cooked with a lot of spices while others are comparatively bland. Spice blends are different for different regions and you can spot the origin of a dish by identifying the ingredients in it.
Story first published: Thursday, May 23, 2013, 11:55 [IST]
Desktop Bottom Promotion