For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరకరలాడే ఫిష్ కబాబ్: రంజాన్ స్పెషల్

|

రంజాన్ ఉపవాసవేళలు అప్పుడే మొదలయ్యాయి. ప్రపంచం మొత్తంగా ఉన్న అనేక మంది ముస్లీములు, ఈ పరమపవిత్ర రంజాన్ ను వేళలను (నెలలో)పరమపవిత్రంగా కఠిన ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ ఉపవాసం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు ప్రారంభమై, సూర్యాస్థమయానికి పూర్తవుతుంది . సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరించి ఆహారంను తీసుకుంటారు.

అలా తీసుకొనే ఆహారంలో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాలను తీసుకుంటారు. అయితే రోజంతా ఉపవాసం ఉండటం చేత సాయంత్రం ఒకే సారి ఒకే మొత్తంలో చాలా మంది ఎక్కవుగా తింటుంటారు. ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది . అయితే కరెక్ట్ ఫుడ్ ను కరెక్ట్ క్వాంటిటీతో తీసుకొంటే ఎటువంటి సమస్య ఉండదు. అలా ఉపవాసం వేళల్లో తీసుకొనే హెల్తీ ఫుడ్స్ లో ఫిష్ కబాబ్ కూడా ఒకటి. ఇది పూర్తి న్యూట్రీషియన్స్ అందిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Crispy Fish Kebab Recipe For Ramzan

కావల్సిన పదార్థాలు:
చేపలు: 500grms
శెనగపప్పు: 4tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp
వెనిగర్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
శెనగపిండి: 4tbsp
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి.
2. తర్వాత ఈ చేపముక్కలను కొద్దిగా నీళ్ళు వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి. పది నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత లోపలి ముళ్ళను తొలగించి చేత్తో మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.
3. తర్వాత శెనగపప్పును రఫ్ గా పొడి చేసుకొని రఫ్ గానే పేస్ట్ లా చేసుకవాలి.
4. ఇ ప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకొన్న చేపను మిక్సింగ్ బౌల్లో వేసి, అందులో శెనగపిండి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్ మరియు వెనిగర్ వేయాలి.
5. మొత్తం పదార్థాలన్నింటిని కలగలిసేలా బాగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం నుండి 5నుండి 6 సమభాగాలుగా చేసుకోవాలి. ఒక్కోక్కో బాగాన్ని అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ గా ఒత్తి పెట్టుకోవాలి.
6. ఇప్పుడు శెనగిపిండిలో కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి పేస్ట్ గా కలుపుకోవాలి.
7. ఇప్పుడు కట్ లెట్ కబాబ్ ను శెనగపిండిలో డిప్ చేయాలి.
8. అంతలోపు స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో కబాబ్ లను వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే క్రిస్పీ మరియు హెల్తీ ఫిష్ కబాబ్ రెడీ. రంజాన్ స్పెషల్ గా ఈ ఫిష్ కబాబ్ ను సర్వ్ చేయండి.

English summary

Crispy Fish Kebab Recipe For Ramzan


 The Ramzan fast has already commenced. People of the Muslim community all over the world fast from sunrise to sunset for about a month. It is one of the most difficult fast to be observed. At the end of the day, the fast is broken by consuming some of the most mouthwatering delicacies.
Story first published: Friday, July 4, 2014, 18:02 [IST]
Desktop Bottom Promotion