For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్-రంజాన్ స్పెషల్

|

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఇన్ స్టాంట్ గా తయారు చేసుకొనే, నోరూరించే నాన్ వెజిటేరియన్ రిసిపి. రంజాన్ వేళలో ఉపవాసం ఉండే వారు ఎక్కువగా నాన్ వెజ్ ను ఇష్టపడుతారు. అందుకే ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ను రంజాన్ రిసిపిగా తయారు చేసుకుంటారు.

ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ టేస్ట్ మాత్రమే కాదు, ఎనర్జీని కూడా అంధిస్తాయి. ఈ రిసిపిని తయారు చేయడం చాలా సులభం. రోజంతా పనితో మీరు బిజీగా ఉన్నా సరే, ఈ క్రిస్పీ చికెన్ లెగ్స్ ను సాయంత్రం అరగంటలో తయారు చేసి, రంజాన్ ఉపవాసాన్ని బ్రేక్ చేసేయవచ్చు. మరి మీరు ఈ క్రిస్పీ చికెన్ లెగ్స్ ను టేస్ట్ చేయాలంటే, వెంటనే ట్రై చేయండి..టేస్ట్ చేయండి..ఎంజాయ్ చేయండి..

Crispy Fried Chicken Legs

చికెన్ లెగ్స్ (కోడి కాళ్లు): 8
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిరపకాయలు: 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
పెప్పర్ పౌడర్: 2tsp
నిమ్మరసం: 2tbsp
మైదా పిండి: 1cup
ఎగ్ వైట్(గుడ్డులోని తెల్లసొన): 2(గుడ్డు పగలకొట్టి తెల్లని ద్రవాన్ని మాత్రం తీసుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పుదీనా ఆకులు: 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వేడీ నీళ్ళు: 1/2cup
బ్రెడ్ ముక్కలు: 1cup
నూనె: 3 cups
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ లెగ్స్ ను చాకుతో చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత, మంచినీళ్ళతో శుభ్రం చేసి, నీరు బాగా తడిఆరిన తర్వాత, చికెన్ లెగ్స్ (ముక్కలకు)ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తొక్కు మరియు పెప్పర్ పౌడర్ వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఉప్పు పట్టించిన చికెన్ ముక్కలకు అప్లై చేసి, పది, పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు, పిండిని తయారు చేసుకోవాలి. అందుకు ఒక గిన్నెలో మైదా తీసుకొని అందులో ఎగ్ వైట్ ను వేసి, కొద్దిగా నీళ్ళు పోసి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, మిగిలిని పెప్పర్ పౌడర్ కూడా వేసి, ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పిండిని మృదువుగా..టేస్టీగా కలుపుకోవాలి.
5. తర్వాత అందులోనే కొత్తిమీర తరుగు మరియు పుదీనా తరుగు వేసి కలపడం వల్ల మంచి సువాసన వస్తుంది.
6. ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి, అందులో నూనె పోసి, మీడియం మంట మీద బాగా కాగనివ్వాలి.
7. తర్వాత మంట మీడియంకు తగ్గించి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ లెగ్స్ ను పిండిలో డిప్ చేసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, కాగే నూనెలో విడవాలి.
8. మూత పెట్టి, చికెన్ లెగ్స్ ను 10నిముషాల పాటు వేగనివ్వాలి. చికెన్ లెగ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగిస్తూ మద్యమద్యలో వాటిని కలియబెడుతూ అన్నివైపులా కాలేలా చేయాలి. అంతే క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Crispy Fried Chicken Legs: Ramzan Spcl

Crispy fried chicken is something that can instantly cheer you up. Call it fattening or unhealthy, the fact remains that nothing is as delicious as some deep fried snacks.
Story first published: Thursday, July 18, 2013, 13:13 [IST]
Desktop Bottom Promotion