For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ హనీ చిల్లీ ఎగ్ : హెల్తీ అండ్ న్యూట్రీషియన్ రిసిపి

|

చైనీస్ ఫుడ్ తయారుచేయడం అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోజూ మనం తయారుచేసుకొనే వంటలకుచాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినే వారికసమే ముఖ్యంగా ఇటువంటి చైనీస్ ఫుడ్ ను కనుగొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం చైనీస్ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాతెలుసుకోవల్సింది.

ఇక్కడ అటువంటి నోరూరించే ఎగ్ రిసిపిని ఒక్కదాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ వంటను ఇంట్లో ప్రతి ఒక్కరూ రుచి చూడవచ్చు. క్రిస్పీ హానీ చిల్లీ ఎగ్ చాలా మంచి స్వీట్ ఫ్లేవర్ ను అందిస్తుంది. అదే విధంగా ఈ వంట స్వీట్ గా మరియు స్పైసీగా ఉంటుంది. ఈ వంటను తయారుచేయడం కూడా చాలా సులభం మరి ఈ స్పెషల్ ఎగ్ రిసిపిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Crispy Honey Chilli Eggs Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించి పొట్టు తీసి నాలుగా బాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
కార్న్ ఫ్లోర్: 2tbsp+2tsp+1tbsp
ఎండు మిర్చి: 2
అల్లం: చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4-5(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
స్ప్రింగ్ ఆనియల్: కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
రెడ్ చిల్లీ సాస్: 2tbsp
సోయా సాస్: 1/2tsp
నిమ్మరసం: 1tbsp
తేనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా మరియు అదనంగా 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
2. దానికి ముందే రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, మూడు చెంచాలా నీరు వేసి చిక్కగా కలిపి పెట్టుకోవాలి.
3. ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న గుడ్డు మీద కొద్దిగా కార్న్ ఫ్లోర్ ను చిలకరించాలి.
4. ఇప్పుడు, ఈ గుడ్డును కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసి, కాగే నూనెలో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ప్రై చేసుకోవాలి.
5. ఇలా అన్ని వేగించి, టిష్యు పేపర్ మీద వేయడంతో అదనపు నూనెను గ్రహించేస్తుంది.
6. ఇప్పుడు మరో రెండు చెంచాలా నూనెను మరో పాన్ లో వేసి కాగిన తర్వాత రెడ్ చెల్లీ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
7. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు అందులోనే స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, తేనె, మరియు నిమ్మరసం మిక్స్ చేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
9. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఫ్రై చేసుకొన్న గుడ్లను వేసి మిక్స్ చేసుకోవాలి.
10. తిరిగి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను చిలకరించి బాగా మిక్స్ చేసి, రెండు, మూడు నిముషాలు ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
11. అంతే , ఈ క్రిస్పీ హనీ చిల్లీ ఎగ్ ను సర్వింగ్ ప్లేట్ లో పెట్టి మరియు స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ హనీ చిల్లీ ఎగ్ రెడీ . దీన్ని సైడ్ డిష్ గా లేదా ఆప్టైసర్ గా కూడా సర్వ్ చేయవచ్చు.

English summary

Crispy Honey Chilli Eggs Recipe

Preparing Chinese food at home is always exciting. It provides a delightful break from the everyday meal. Even the most picky eaters in the family such as kids are extremely fond of Chinese food. So, why not prepare a special Chinese chicken recipe which your kids will relish with utmost pleasure.
Story first published: Wednesday, January 7, 2015, 13:03 [IST]
Desktop Bottom Promotion