For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీరదోసకాయ చికెన్-చాపాతికి అద్భుత కాంబినేషన్

|

నాన్ వెజ్ ప్రియులు మాంసాహారాన్ని వివిధ రకాలుగా తయారు చేసి కొత్త రుచిలను చూస్తుంటారు. చికెన్ ను ఒకే పద్దతిలో చేసినవే చేసి చేసి బోరు కొడుతుంటే..ఈ వీకెండ్ లో కుకుంబర్ చికెన్ తయారు చేసి చూడండి. ఈ రిసిపి చాలా టేస్టీ మరియు హెల్తీ కూడా.

చికెన్ కు కుకుంబర్ ను చేర్చడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు మంచి టేస్ట్ కూడా. చికెన్ రిసిపి చాలా స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది. ఈ కుకుంబర్ చికెన్ రిసిపి అన్నం మరియు చపాతీలకు అద్భుత కాంబినేషన్ గా ఉంటుంది.

Cucumber Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
బంగాళ దుంపలు : 2 (cubed/diced)
దోసకాయ: 1 పెద్దది(సన్నగా చిన్న ముక్కలుగా తరిగుకోవాలి)Marination కోసం; 1 మీడియం(garnishing కోసం)
పెరుగు: 1cup
కాప్సికమ్: 1
ఉల్లిపాయలు: 2
టమోటా: 1
అల్లం: 1చిన్న ముక్క
వెల్లుల్లి: 3- 4రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: ఒక చిటికెడు
ఏలకుల: 2(పొడి చేసుకోవాలి)
దాల్చిన చెక్క: 2(సన్నగా కట్ చేసరోవాలి)
పసుపు: ½tsp(marination కోసం); ½tsp(వంట కోసం)
కారం: ½tsp(marination కోసం); ½tsp(వంట కోసం)
కొత్తిమీర పొడి: ½tsp(marination కోసం); ½tsp(వంట కోసం)
జీలకర్ర పొడి: ½tsp(marination కోసం); ½tsp(వంట కోసం)
చికెన్ మసాలా పొడి: 1tsp
పచ్చి మిర్చి: 2-3 (చీలిక)
ఆవాల నూనె: 2(marination)tsps;వంట కోసం: 2tsps

తయారు చేయు విధానం:
1. పెరుగు, కీరదోస, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పంచదార, ఉప్పు, మస్టర్డ్ ఆయిల్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి బాగా,
2. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమోటో, అల్లం మరియు వెల్లుల్లి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత, పాన్ లో కొద్దిగా నూనె వేసి, బంగాళదుంప ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె, కాగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొన్న క్యాప్సికమ్ ఉల్లిపాయ వేల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకూ వేగించుకొని, తర్వాత అందులో పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు ఒక దాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి, వేగించాలి.అలాగే చికెన్ ముక్కలతో పాటు, చికెన్ మసాలా పౌడర్, ఫ్రైడ్ పొటాటో, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
6. తర్వాత యాలకుల పొడి, చెక్క పౌడర్ రెండు చిలకరించాలి.
7. తర్వాత చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత క్రిందికి దింపుకొనే ముందు కీరదోస ముక్కులను గార్నిష్ చేసి వేడి వేడి అన్నం, చపాతీలతో సర్వ్ చేయాలి.

English summary

Cucumber Chicken Recipe

Are you bored of trying out the same chicken recipes again and again? Then try out this cool cucumber chicken recipe this weekend. This is a quick, easy and healthy chicken recipe which is sure to take your taste-buds on a delightful ride.
Story first published: Saturday, June 29, 2013, 14:25 [IST]
Desktop Bottom Promotion