For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొంచెం ఘాటు..కొంచెం కారం..కరివేపాకు చికెన్

|

కర్రీలీవ్స్(కరివేపాకు)చికెన్ ఓ అద్భుతమైన కాంబినేషన్. అద్భుతమైన సువాసనతో ఉండే ఈ కర్రీలీవ్స్ చికెన్ ఇండియన్ కుషన్ లో ఒకటిగా..సౌంత్ ఇండియాలో ఎక్కువగా తయారు చేసేటటువంటి వంటకం. కరివేపాకులో సువాసన, డార్క్ గ్రీన్ షైనింగ్ మరింత నోరూరిస్తుంటుంది. అంతే చికెన్ కర్రీ లీవ్స్ కర్రీ తయారు చేయాలంటే అందుకు తాజాగా ఉండే కరివేపాకు ఉపయోగించాలి.

సాధారణంగా ఎన్ని కర్రీస్ ఉన్నా.. మాంసాహారానికే ముందు ప్రిఫరెన్స్. కొంచెం ఘాటుగా, మరికొంచెం స్పైసీగా ఉండి నోట్లో నీళ్లూరించే..కర్రీలీవ్ చికెన్ కర్రీ చపాతీ, నాన్, రోటీ అన్నం అన్నింటిలోకి అద్భుతమైన రుచిని అందిస్తుంది. అన్నంలోకి డ్రైగా ఉండే కూరలకంటే గ్రేవీని ఇష్టపడే వారి సంఖ్యే ఎక్కువ. కాబట్టి కర్రీలీవ్స్ చికెన్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Curry Leaves With Chicken

కావలసిన పదార్థాలు:
చికెన్: 100grm
కరివేపాకు: 1/2cup
పచ్చిమిరపకాయలు: 3-4
కొబ్బరితురుము: 3tbsp
జీడిపప్పు: 8-10
ధనియాలు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె : సరిపడా
ఉల్లిగడ్డలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
దాల్చిన చెక్కలు: 2
యాలకులు: 4
లవంగాలు: 4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పసుపు: 1/4tsp
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp

తయారు చేసే విధానం:
1. ముందుగా పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొబ్బరితురుము, జీడిపప్పు, ధనియాలను వేయించుకోవాలి. వీటిని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొంత నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. మీడియం మంటమీద ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత ముందు చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్, చికెన్ వేసి ఒక 5నిముషాలు వేగిగించిన తర్వాత సరిపడా నీళ్లుపోయాలి. ఐదు నిమిషాల తర్వాత ఉప్పు వేసి మరికాసేపు అలాగే ఉండికించుకోవాలి.
5. చివరగా కొత్తిమీరను గార్నిష్ చేసి దించేయాలి. నోరూరించే కరివేపాకు కోడికూర రెడీ అయినట్టే!

English summary

Curry Leaves With Chicken | కరివేపాకు చికెన్-హెల్తీ అండ్ టేస్టీ


 Curry Leaves Chicken is an excellent combo of flavours popularly prepared in Indian cuisine especially a south Indian dish. It is a different recipe with tastes very good. Curry leaf lends a gorgeous, aromatic, shiny dark green lemon flavour to the dish. It is also best to use fresh curry leaves while preparing this dish.
Story first published: Monday, April 22, 2013, 12:54 [IST]
Desktop Bottom Promotion