For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్ ఖీమా రిసిపి : రంజాన్ స్పెషల్

|

రంజాన్ మాసం వచ్చేసింది. సాయంత్రం వేళ బయటికి వెళితే హలీం ఘుమఘుమలు ముక్కుల్ని అదరగొట్టేస్తున్నాయి. ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఇష్టపడి తినే వంటలు కొన్ని ఉన్నాయి. కర్జ్జూరాలతో రోజాని విడిచాక హలీం లేదా చికెన్ టిక్కా, బోటి కబాబ్, అపొలో ఫిష్, ఆపై బిర్యానీ, ఫ్రూట్ సలాడ్... ఇలా సాగుతుంది వారి డిన్నర్.

మాంసంతో కూరలు వగైరా చేసుకోవడం తెలుసు కాని కాస్త వెరయిటీగా మటన్ ఖీమాతో పప్పు చేసుకుందాం. ఇది కాస్త హైదరాబాదీ స్టైల్..పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎక్కువ దినుసుల అవసరం కూడా ఉండదు. చేయడం కూడా సులువే మరి.

Dal Keema Recipe: Ramzan Special: Telugu Vantalu

కావలసిన పదార్థాలు :
మటన్ ఖీమా - 250 gms
కందిపప్పు - 1cup
చింతపండు - కొద్దిగా
ఉల్లిపాయ- 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

READ MORE: ఖీమా పకోడ: రంజాన్ స్పెషల్ స్నాక్
పసుపు- 1/2tsp
కారం- 2tbsp
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిర్చి- 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు- 2రెమ్మలు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 2tsp
గరం మసాలా పొడి - 1tsp
నూనె - 3tbsp

READ MORE: సేమియా పాయసం: రంజాన్ స్పెషల్

తయారుచేయు విధానం:
1. ముందుగా కందిపప్పును చిటికెడు పసుపు, కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించాలి.
2. తర్వాత చింతపండు కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి.
3. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
4. తర్వాత అందులోనే పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, కరివేపాకు వేసి కొద్దిగా మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిన ఖీమా, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీరంతా ఇగిరిపోయేదాక వేయించాలి.

READ MORE: షహీ మటన్ కుర్మా రిసిపి: రంజాన్ స్పెషల్

6. తర్వాత కప్పుడు నీరు పోసి ఉడికించాలి. ఖీమా ఉడికాక , చింతపండు పులుసు చిక్కగా తీసుకుని ఇందులో వేసి కొద్దిగా ఉడికించాలి.
7. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న కందిపప్పును మెదిపి ఇందులో వేసిన ఉప్పు సరిచూసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలిపి ఉడికించాలి.
8. మొత్తం పప్పు , ఖీమా కలిపి సమానంగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి దింపేయాలి. అంతే దాల్ ఖీమా రిసిపి రెడీ. రంజాన్ స్పెషల్ గా దీన్ని తయారుచేసి తీసుకోవచ్చు. రైస్, చపాతీ, రోటీలకు చాలా మంచి కాంబినేషన్

English summary

Dal Keema Recipe: Ramzan Special: Telugu Vantalu

Dal Keema Recipe: Ramzan Special: Telugu Vantalu. Here's a delicious, tempting non veg recipe dal keema, that can be made within no time and served with hot nan.
Story first published: Thursday, June 25, 2015, 15:42 [IST]
Desktop Bottom Promotion