For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన లోఫ్యాట్ దహీ చికెన్ రిసిపి

|

ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వారు, ముఖ్యంగా మాంసాహార ప్రియులు, వారి రెగ్యులర్ డైట్ లో లీన్ మీట్ ను చేర్చుకోవాలి. మీరు ఒక ఖచ్చితమైన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నట్లైతే, ఇటువంటి డిష్ ను బోనస్ గా జోడించాల్సిందే. చికెన్ అత్యధిక ప్రోటీనులున్న హెల్తీ ఫుడ్. చికెన్ లో చాల తక్కువ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల, క్యాలరీలను తగ్గించుకొనే వారు దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దహీ చికెన్ ఇండియన్ వంటకం. ఇది తయారు చేయాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి. ఈ చికెన్ రిసిపి అద్భుతమైన టేస్ట్, వాసన కలిగి వేడి వేడి అన్నం, రోటీ, పులావ్, జీరా రైస్ వంటి వాటికి మంచి కాంబినేషన్.

ఇండియన్ స్గైల్ దహీ చికెన్ కు మసాలా దినుసులు అధికంగా ఉపయోగించనవసరం లేదు. ఎందుకంటే ఈ వంటకం యొక్క సువాసనంత పెరుగుతోనే వస్తుంది. పెరుగులో నానబెట్టడం వల్ల అద్భుతమైన టేస్ట్ కలిగి మంచి కలర్ కూడా వస్తుంది. చికెన్ ను ముందుగా మ్యారినేట్ చేయడంతో ఈ వంట తయారు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. కొత్త రుచి చూడాలనుకొనే వారు కాస్త ఓపిగ్గా దీన్ని తయారు చేసుకోవచ్చు.

Delectable Low Fat Dahi Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg(బోన్ లెస్)
పెరుగు: 2 1/2 cup
జీలకర్రపొడి: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం: 1/2tsp
పసుపు: 1/4tsp
గరం మసాల: 1/4tsp
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: కొద్దిగా గార్నిష్ కోసం
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీలకర్రపొడి, వెల్లుల్లి పేస్ట్, గరం మసాల, పసుపు మరియు కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
2. ఇలా మొత్తం మిశ్రమం మిక్స్ చేసుకొన్న తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
3. చికెన్ కు మసాలా బాగా పట్టాలంటే ఇలా కలుపుకొన్న చికెన్ కొంత సమయం పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టడానికి ముందు అందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మిక్స్ చేసి 15నుండి 30నిముషాలు పెట్టుకోవాలి.
4. అరగంట తర్వాత పాన్ తీసుకొని , అందులో సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
5.ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ , మీడియం మంట మీద వేగించుకోవాలి . టమోటో మెత్తగా వేగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి మొత్తమిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. పెరుగు గ్రేవీతో బాగా మిక్స్ అయ్యే వరకూ కలిబెడుతూ ఉడకించుకోవాలి. అవసరం అయితే అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు.
7. మొత్తం తయారైన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన లోఫ్యాట్ దహీ చికెన్ రెడీ...

English summary

Delectable Low Fat Dahi Chicken Recipe


 Chicken is one of the best lean meats to add to your diet. If you are under a strict weight loss program, then this recipe will be an added bonus. Chicken is healthy and rich in protein.
Story first published: Monday, December 1, 2014, 17:56 [IST]
Desktop Bottom Promotion