For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దహీ ఖీమా రిసిపి : రుచికరమైనది

|

దహీ ఖీమా రిసిపి ఒక అద్భుతమైన రుచికలిగి న్యూట్రీషియన్ వంట. ఈ వంటకు కావల్సిన ప్రధాన పదార్థాలు, పెరుగు మరియు మటన్. పెరుగులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి . ఈ మాంసాహారంలో పోషకపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పూర్తిగా చాలా రుచికరంగా ఉండే ఒక డైట్ ఫుడ్.

ఖీమాను వివిధ రకాలుగా చేస్తారు. అలాంటి వాటిల్లో దహీ ఖీమా రిసిపి ఒకటి, ఇది చాలా కమ్మని రుచి కలిగి ఉంటుంది. అంతరుచికి కారణం, ఖీమాలో కలిపే పెరుగుతోనే అద్భుతమైన రుచి ఉంటుంది. మరి టేస్టీ మరియు న్యూట్రీషియన్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Delicious Dahi Keema Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్: 1kg
పెరుగు: 500 grams
అల్లం పేస్ట్: 3 tsp
వెల్లుల్లి పేస్ట్ : 3 tsp
ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
లవంగాలు: 5 to 7
దాల్చిన చెక్క: 1చిన్న ముక్క
లవంగాలు: 2 pieces
యాలకలు: 2 pieces
పచ్చిమిర్చి: 6-7 pieces
బిర్యానీ ఆకు: 2 pieces
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 3 tsp
తాజా కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లోకొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, బ్లాక్ యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మరియు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ మరియు బాగా మిక్స్ చేసి కొద్ది సమయం ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

4. అందులోనే టమోటోముక్కలు కూడా వేసి మొత్తగా వేగించుకోవాలి.
5. ఇప్పుడు ఖీమా మిశ్రమంలో ముందుగా వేగించుకొన్న మసాలామిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులో ఉప్పు మరియు కారం కూడా వేసి పొడిగా డ్రై ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ, మంట తగ్గించి మూత పెట్టి, ఖీమాకు పెరుగు బాగ పట్టే వరకూ ఉడికించుకోవాలి.
8. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.అంతే దహీ ఖీమా మటన్ రెడీ . దీన్ని వేడి వేడి బాస్మతి రైస్ తో లేదా చపాతీకి కాంబినేషన్ గా సర్వ్ చేయాలి.

English summary

Delicious Dahi Keema Recipe

Dahi keema recipe is one of the most nutritious recipes as its main ingredients are yoghurt and mutton. Yogurt is rich in calcium and other nutrients, while meat contains all the essential proteins. It is a complete diet and tasty as well. If you love mutton, then you should try out this dahi keema recipe. 
Desktop Bottom Promotion