For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఢాబా స్టైల్: బొమ్మిడాయిల పులుసు

|

ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రిప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రోడ్ సైడ్ డాబాల్లో తినడానికి ఏమాత్రం
సిగ్గుపడకుండా టేస్ట్ చూసేయండి. ముఖ్యంగా రోడ్ సైడ్ డాబ ఫుడ్ చాలా వెరైటీగా మరియు టేస్టీగా ఉంటాయి.

మాంసాహార ప్రియుల కోసం తయారు చేసే నాన్ వెజ్ వంటలు వేటికవే రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫిష్ కర్రీ, బొమ్మిడాయిల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియన్ మసాలా దినుసులతో పాటు కొద్ది చింతపులుసుతో తయారుచేస్తే స్పైసీగా మరియు ట్యాంగీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ బొమ్మిడాయిల పులుసును మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి...

Dhaba Style: Bommidala Pulusu Recipe

కావల్సిన పదార్థాలు:
బొమ్మిడాయిలు(చేపలు): ½ kg
చింతపండు :కొద్దిగా (నీటిలో నానబెట్టుకోవాలి)
మెంతులు : 2tsp
జీలకర్ర: 1 tsp
పచ్చిమిర్చి: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు : 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఆవాలు : 1 tsp
పసుపు : 1 tsp
ఉల్లిపాయ : 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
మసాలా పౌడర్ : (కారం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులును పొడి చేసుకోవాలి) : 2tsp
కరివేపాకు : 2 రెమ్మలు
కారం : 1tbsp
కొత్తిమిర తరుగు: 3tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక నిముషం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
3. మీడియం మంటలో ఉల్లి, టమోటో ముక్కలు వేగిన తర్వాత, అందులో పసుపు, కారం, మరియు మసాలా పౌడర్ వేసి కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
5. 5నిముషాల తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలను అందులో వేసి, చిక్కటి గ్రేవీతో బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులోనే చింతపండు పులుసు కూడా పోసి మూత పెట్టకుండానే 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. చేపముక్కలు మీడియంగా ఉడికిన తర్వాత చిక్కబడ్డ గ్రేవీ మీద కరివేపాకు మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే డాబా స్టైల్ బొమ్మిడాయిల పులుసు రెడీ.

English summary

Dhaba Style: Bommidala Pulusu Recipe

If you ever take a road trip to Andhra don't hesitate to stop aside and try this yummy bommidala pulusu at a dhaba. This yummy fish treat is a famous one in the city and consuming it in its dry or fresh form has varied tastes.
Story first published: Thursday, March 19, 2015, 13:15 [IST]
Desktop Bottom Promotion