For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చూడగానే నోరూరించే డాబా స్టైల్ చికెన్ రిసిపి

|

బటర్ చికెన్ లేదా చికెన్ మఖాని ఒక అద్భుతమైనటువంటి నాన్ వెజిటేరియన్ సైడ్ డిష్. ఇది ఇండియాలో నార్త్ స్టేట్స్ లో చాలా పాపులర్ వంటకం. ఈ వంటలో సువాసనకు ఉపయోగించిన మసాలాలు మరియు చికెన్ మరియు క్రీమ్, బటర్ ఇవన్నీ కలిపి వండిన ఈ చికెన్ రిసిపి చూడగానే వెంటనే నోరూరిస్తూ రుచిచూసేయాలనిపిస్తుంది. బటర్ చికెన్ గ్రేవి ఒక సాంప్రదాయకరమైన వంటకం. ఇది చాలా సులభంగా తయారు చేస్తారు.

కానీ ఈ మద్య కాలంలో డాబా స్టైల్ వంటకాలు ఇండియాలో చాలా ప్రసిద్ది చెందాయి. ముఖ్యంగా వారి స్టైల్ వంటకాలు, స్పైసీ ఫుడ్స్ చాలా ప్రసిద్ది. వీరు తయారు చేసే డాబా స్టైల్ బటర్ చికెన్ మీరు చాలా సులభంగా ప్రయత్నం చేయవచ్చు. ఇది చాలా సింపుల్ గా మరియు కారంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

Dhaba Style Butter Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500gms(చర్మం మరియు ఎముకలు లేని, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 1tsp
చికెన్ స్టాక్: 1cup
బాదం: 8-10 (నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి)
క్రీమ్: 3tbsp
నిమ్మకాయ: 1
పెరుగు: ½cup
గరం మసాలా: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
మెంతి ఆకులు: 1tsp
లవంగాలు: 3
మిరియాలు: 7
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకుల విత్తనాలు: 1tsp
బే ఆకులు: 2
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1/2cup
వెన్న: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, గరం మసాలా, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిఆకులు, ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి ఈ మసాలా మిశ్రమంలో చికెన్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసి (మ్యారినేట్ చేసి) ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్ వేడి చేసి అందులో మిరియాలు, లవంగాలు, బిర్యాని ఆకు, చెక్క మరియు యాలకుల విత్తనాలు వేసి లైట్ గా మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత వీటిని పది నిముషాలు చల్లారనిచ్చి తర్వాత పౌడర్ చేసుకోవాలి.

3. తర్వాత అదే పాన్ లో 3-4టేబుల్ స్సూన్ నూనె వేసి, ఉల్లిపాయలు వేసి మీడియం మంట మీదు 5నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

4. ఇప్పుడు అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

5. చికెన్ ఉడుకుతుండగా పైన నూనె తేలుతుంది. అప్పుడు అందులో చికెన్ స్టాక్(చికెన్ ఉడికించిన నీరు) మరియు ఫ్లేవర్ కోసం వేగించుకొన్ని లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్ మొ..మిశ్రం యొక్క పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత మంట మీడియంగా పెట్టి అరగంట పాటు చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.

6. ఇప్పుడు అందులో బాదం పేస్ట్, బట్టర్, క్రీమ్ వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి డాబా స్టైల్ చికెన్ రెడీ. వేడి వేడి రిసిపిని అన్నం లేదా నాన్స్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Dhaba Style Butter Chicken Recipe


 Butter chicken or chicken makhani is a delicious non-vegetarian side dish that is popular in northern states of India. The aroma of spices, chicken and butter makes it a lip smacking dish. Butter chicken gravy is an authentic dish which can be prepared very easily.
Story first published: Tuesday, July 30, 2013, 15:10 [IST]
Desktop Bottom Promotion