For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దమ్ కా బిర్యానీ : రంజాన్ స్పెషల్

|

బిర్యానీ అంటే మొదట గుర్గు వచ్చేది మన ఇండియాలో హైదరాబాదే. మన భారతదేశంలోనే బిర్యానీ తినాలంటే మాత్రం హైదరాబాదా రావాల్సిందే...బిర్యానీ, మైదరాబాద్ ఒకే సంస్కృతికి రెండు పేర్లు. మిర్చీకా సాలన్, పెరుగు పచ్చడి, మీటా పాన్, డబుల్ కా మీఠా.. ఇవన్నీ బిర్యానీకి అదనపు రుచులు అందిస్తాయి. అంతే కాదు, రాజులు, మహారాజులు, సామాన్యులు -...ఇలా ఎవరైనా సరే హైదరాబాద్ బిర్యానీకి తలవంచి సలామ్ చెయ్యాల్సిందే. మరి బిర్యానీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా స్పెషల్ గా తయారు చేసుకుంటే ఆ మజాయే వేరు.

సాధారణంగా మనం వివిధ రకాలుగా బిర్యానినీ తయారుచేసుకుంటాం, ఈ రంజాన్ మాసంలో మరింత స్పెషల్ గా దమ్ కా బిర్యానీ తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది. చాలా సింపుల్ గా అతి తక్కువ మసాలా దినుసులతో తయారుచేసే ఈ చికెన్ దమ్ కా బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Dum Ka Biryani: Ramzan Special

కావలసిన పదార్థాలు:

చికెన్ : 1kg
బాస్మతి బియ్యం : 1kg
గరం మసాల : 2tsp
అల్లం వెల్లుల్లి ముద్ద : 1tsp
పెరుగు : 1cup
ఉల్లిపాయ ముక్కలు : 1/2cup
పచ్చి మిరపకాయలు : 5
ఎండు మిరపకాయలు : 6
పసుపు : చిటికెడు
కొత్తమీర : ఒక కట్ట
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కొద్దిగా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక వంతు బియ్యానికి రెండొంతుల నీళ్లు పోసి స్టౌమీద మీద పెట్టి హాఫ్ బాయిల్ చేసుకొని, అదనపు గంజిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
4. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్రలో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలాగే ఇంకో పొరలా మిగిలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి.
5. పాత్ర నుంచి ఆవిరి బయటకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. 6. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించుకోవలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే

English summary

Dum Ka Biryani: Ramzan Special

When we go down South, the Nizams of Hyderabad give us the Hyderabadi Dum Biryani recipe. Dum biryani is a category by itself because it is prepared in a particular way. In God's own country Kerala, we can discover the charms of the Malabar style biryani. You can smell the sweet scent of the young banana leaf in this biryani recipe along with the rich taste of coconut.
Story first published: Tuesday, July 8, 2014, 12:42 [IST]
Desktop Bottom Promotion