For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ చికెన్ రైస్ - మైక్రోవోవెన్ రిసిపి

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మైక్రోవేవ్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతారు. ఫుడ్ లవర్స్ కు మైక్రోవేవ్ రిసిపిలు హిట్ లిస్ట్ లో ఉంటాయి. వర్క్ చేసి వారు చాలా మంది మైక్రోవేవ్ వంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

మైక్రోవేవ్ లో తయారు చేసిన వంటలు, రుచిలో చాలా అద్భుతంగా ఉంటాయి. మరియు ఆరోగ్యరం కూడా!అవి వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా సరే అటువంటి ఒక అద్భుతమైన మైక్రోవొవెన్ చికెన్ రిసిపి మీకోసం...ఎలా తయారు చేయాలో చూడండి..

Chicken Rice

వండిన అన్నం: 2cups
చికెన్ ముక్కలు: 1cup(బోన్ లెస్)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగాలి)
కాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా తరిగాలి)
టమోటా గుజ్జు: ½cup
గ్రీన్ బటానీలు: 2tbsp
నల్ల మిరియాలు పొడి: 1tsp
పప్రికా(మిరపకాయ పొడి): ఒక చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. రైస్ కుక్కింగ్ మైక్రోవోవెన్ డిష్ లో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం, ఉల్లిపాయతరుగు, క్యాప్సికమ్, నూనె వేసి, మ్రైక్రోవేవోన్ హైలో పెట్టి 3-4మినిట్స్ ఉంచాలి.
2. తర్వాత మిగిలిన అన్ని పదార్థాలు, చికెన్ ముక్కలు తప్ప మిగిలినవన్నీ పదర్థాలు వేసి, పప్రికా (రెడ్ చిల్లీ పౌడర్)కూడా వేయాలి. తర్వాత టమోటో గుజ్జు, గ్రీన్ పీస్(పచ్చిబఠానీ), బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు ఉప్పువేయాలి)
3. తర్వాత అన్నీ పదార్థాలు వేసిన తర్వాత పైనగా చికెన్ ముక్కలను కూడా వేసి, మైక్రోవేవొనె డిష్ కు వచ్చిన ఒక ప్లాస్టిక్ వ్రాప్ (మూత )పెట్టాలి.
4. తర్వాత మైక్రోవోవెన్ ను 10-12నిముషాలు హైలో పెట్టాలి. తర్వాత ఒక సారి ఓపెన్ చేసిన మరో సారి చికెన్ ముక్కలను మిగిలన మిశ్రంతో కలిసేలా మిక్స్ చేసి, మళ్ళీ మూత పెట్టి మరో 5-10నిముషాలు మైక్రోవోవెన్ హైలో పెట్టి ఉడికించుకోవాలి.
5. అంతే చికెన్ రైన్ మైక్రోవోవెన్ రిసిపి రెడీ. ఈ చికెన్ రిసిపిని రైతా లేదా సలాడ్ తో వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

English summary

Easy Chicken Rice Recipe

These days a lot of people prefer cooking in the microwave. Suddenly, the microwave recipes are on the hit list of food lovers. So most of the working people prefer cooking simple dishes in the microwave to save time.
Story first published: Saturday, August 31, 2013, 14:18 [IST]
Desktop Bottom Promotion