For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ కీమా పులావ్‌ రిసిపి

|

కీమా పులావ్ రిసిపి ఇది ముఘలాయ్ వంట మరియు ముఖ్యంగా పాకిస్తానీయులకు ఇది ఒక ప్రధానమైన మీల్ డిష్ . ఈ వంటి చాలా టేస్టీగా మరియు ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు వివిధ రకాల మసాలా దినుసులతో చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు.

కీమా పులావ్ రిసిపి ఒక్క సారి రుచి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ తినాలిపిస్తుంది. కీమా పులావ్ కు మీరు కూడా ఫేవర్ అయిపోవాల్సింది. మరి అంతటి టేస్టీ మరియు ఫ్లేవర్ ఉన్న ఈ కీమా పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy Keema Pulao Recipe

కావాల్సిన పదార్థాలు:
మటన్‌కీమా: 250grms
బాస్మతి బియ్యం: 250grms
పుదీనా: ఒక కట్ట (పేస్ట్‌ చేసుకోవాలి)
బజ్జీ మిర్చి: 50grms(లావుగా తరగాలి),
పచ్చి మిరపకాయలు: 6 (పేస్ట్‌ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 2tbsp
నెయ్యి: 100grm
గరంమసాలా పొడి: 2tbsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
2. మొదట ఒక కుక్కర్‌లో నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా దోరగా వేయించాలి. దీనికి కీమా వేసుకోవాలి. పసుపు ఒక టేబుల్‌ స్పూను, పుదీనా పేస్ట్‌ కలపాలి.
3. తరిగిన బజ్జీ మిర్చిని వేసి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్‌ కలపాలి. అరలీటర్‌ వాటర్‌ పోసి కుక్కర్‌ మూత పెట్టాలి. రెండు విజిల్స్‌ దాకా ఉంచాలి.
4. కీమా ఉడికిన తర్వాత దాంట్లో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని పోసి.. అందులో కొత్తిమీర కలిపి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకుంటే కీమా పలావ్‌ రెడీ.

English summary

Easy Keema Pulao Recipe


 Keem Pulao is a dish from Mughlai cuisine and a course meal in Pakistan.This is a flavorful and easy to cook dish with a huge yum factor, guaranteed to make you fall in love with it in the first bite. Find out how to make kheema pulao.
Story first published: Tuesday, February 24, 2015, 14:50 [IST]
Desktop Bottom Promotion