For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ పంజాబీ చికెన్ మసాలా రిసిపి

|

పంజాబీ రుచులు చాలా వరకూ నోరూరిస్తూ కలర్ ఫుల్ గా ఉంటాయి. చికెన్ వివిధ వెరైటీలుగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పంజాబీ స్టైల్స్ లో మరిన్ని వెరైటీలు వండుకుంటారు. అందులో ముఖ్యంగా బట్టర్ చికెన్, పాటియాలా చికెన్, కడై చికెన్ మొదలగునవి.

ఈ టేస్టీ వంటకాలతో పాటు మరో వెరైటీ వంటకం పంజాబీ స్పెషల్లో స్పైసీగా తయారు చేసే చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రిసిపికి పంజాబీ చికెన్ మసాలాతో తయారు చేయడం వల్ల అంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది మరి మీరు మీ ఇంట్లో ఈ స్పైసీ పంజాబీ రిసిపిని టేస్ట్ చేయాలంటే ఈ క్రింది విధానం ఫాలో అవ్వాల్సిందే..

Easy Punjabi Chicken Masala Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grm(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం:వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 1tsp
పసుపు: 1tsp
బ్లాక్ పెప్పర్: 5 (పొడిచేసుకోవాలి)
ఏలకుల: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాల నూనె: 3tbsp
నీళ్ళు: 1cup

పంజాబీ స్పెషల్ గరం మసాలా కోసం:
ధనియాలు: 2tsp
జీలకర్ర: 2tsp
దాల్చిన చెక్క : చిన్న ముక్క
మెంతులు: ½tsp
నల్ల మిరియాలు: 2tbsp
బే ఆకులు: 2

తయారు చేయు విధానం:
1. ముందుగా గరం మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత చికెన్ ను శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, చెక్క, యాలకులు, వేసి ఒక నిముషం వేగించాలి.

4. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి 5-6నిముషాల పాటు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉండి,తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2-3నిముషాలు వేగించుకోవాలి.

5. తర్వాత టమోటో ముక్కలు, కారం, పసుపు, మిరియాలపొడి వేసి మరో 5నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు ఫ్రై బాగా వేగిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి పది నిముషాల పాటు వేగించుకోవాలి. వెంటనే ఉప్పు, అలాగే ప్రత్యేకంగా తయారు చేసుకొన్న గరం మాసాలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

7.తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, మూత పెట్టి తక్కువ మంట మీద 20నిముషాలు పాటు బాగా ఉడికించుకోవాలి.

8. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికాయని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి అంతే పంజాబి స్పెషల్ చికెన్ రెడీ. ఈ సెష్పల్ డిష్ ను చపాతీ లేదా జీరా రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Easy Punjabi Chicken Masala Recipe

The Punjabi cuisine is renowned throughout the world for its lip smacking and exotic taste. Chicken especially is cooked in many different ways in Punjabi cuisine. The various celebrated varieties of chicken recipes like the butter chicken, patiala chicken, kadhai chicken etc.
Story first published: Friday, June 21, 2013, 17:29 [IST]
Desktop Bottom Promotion