For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ టేస్టీ చికెన్ భున

|

చికెన్ భున కారంగా ఉండేటటువంటి నాన్ వెజిటేరియన్ నార్త్ ఇండియన్ రిసిపి. ఈ చికెన్ భున తయారు చేయడం చాలా సులభం మరియు రుచికరం కూడా. ఈ చికెన్ భున తయారు చేయడానికి కొన్ని మసాల దినుసుల ఉపయోగించి మ్యారినేషన్ చేసి ఉడికించడమే ఈ వంటకం యొక్క ప్రత్యేకత. చికెన్ మసాలా పేస్ట్ తో మ్యారినేట్ చేసి నిదానంగా ఉండికించడం వల్ల అద్భుతమైన..నోరూరించే ఫ్లేవర్ కలిగిఉంటుంది. ఈ చికెన్ భునాను సమ్మర్ స్పెషల్ గా వెరైటీగా వండుకోవచ్చు.

ఈ రిసిపిని వివిధ పద్దతుల్లో వండుకోవచ్చు . అయితే ఇంట్లోనే అతి సులభంగా చికెన్ భున తయారు చేసుకోవాలంటే ఇదే సులభ పద్దతి. మరి మీకోసం అతి సులభం పద్దతి మీరూ ఒక సారి ట్రైచేయండి... సమ్మర్ వెకేషన్స్ ను ఎంజాయ్ చేయండి...

Chicken Bhuna
చికెన్: 1kg (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 12 రెబ్బలు
ఎండు మిరపకాయలు: 10
లవంగాలు : 4
యాలకులు: 4
దాల్చిన చెక్క : చిన్న ముక్క(2 అంగుళాలు)
జీలకర్ర: 1tsp
పెరుగులో : ½cup
పసుపు : 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆవాల నూనె: 2tbsp
తాజా కొత్తిమీర: ½cup(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో ఎండు మిర్చి, లవంగాలు, యాలకులు, చెక్క, పసుపు వేసి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

2. తర్వాత చికెన్ ను శుభ్రంగా కడిగి పేపర్ టవల్ తో తడిని తుడిచేయాలి.

3. తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మసాల పేస్ట్ కు ఒక టీస్సూన్ నూనె చేర్చి బాగా మిక్స్ చేసి చికెన్ ముక్కలకు పట్టించి ఒక పక్కన పెట్టుకోవాలి. దీన్ని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

4. రెండు గంట తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి పది నిముషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5.ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర ఒకనిముషం వేగించుకోవాలి.

6. తర్వాత అందులోనే ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలను, ఉప్పు, పెరుగు, అరకప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.

7. తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లరానివ్వాలి.

8. ఆవిరంతా బయటకు వచ్చేసేంత వరకూ మూత తియ్యకూడదు. తర్వాత మూత తీసి ఫ్రైయింగ్ పాన్ లోకి చికెన్ తీసుకొన్ని ఎక్సట్రా నీళ్ళు పోయేవరకూ ఒకటి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. చికెన్ కు మసాలా బాగా పడుతుంది. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ సులభమైన చికెన్ భునాను వేడి వేడి అన్నం లేదా రోటీలకు అద్భుతమైన కాంబినేషన్ తో ఎంజాయ్ చేయండి.

English summary

Easy Recipe for Chicken Bhuna | స్పైసీ అండ్ టేస్టీ చికెన్ భున

Chicken bhuna is a spicy and delicious non-vegetarian dish from North India. The key factor in this easy chicken bhuna recipe is that, the chicken is first grilled and then cooked with a lot of spices.
Story first published: Thursday, May 9, 2013, 17:13 [IST]
Desktop Bottom Promotion