For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓవెన్ తో పనిలేదు : స్పైసీ తందూరి చికెన్ రెడీ..

|

మీరు నాన్ వెజ్ ప్రియులా? చికెన్ వంటలంటే మహా ఇష్టమా? అయితే మీకోసం ఒక స్పెషల్ నాన్ వెజ్ రిసిపి. తందూరి చికెన్. తందూరి చికెన్ అంటే కొన్ని మసాలా దినుసులను మ్యారినేట్ చేసి ఓవెన్ లేదా గ్రిల్స్ మీద బర్న్ చేస్తారు. చికెన్ క్రిస్పీగా మారే వరకూ అన్ని వైపుల్ కాల్చి సర్వ్ చేస్తుంటారు.. అలా కాకుండా మనం ఇంట్లోనే తందూరి చికెన్ ను తయారుచేసుకోవచ్చు.

తందూరి చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి తగినన్ని పదార్థాలతో పాటు చికెన్ ఉంటే, ఇక ఇంట్లోనే తందూరి చికెన్ రిసిపి రెడీ. ఓవెన్ లేదా తందూర్ లేదని చాలా మంది తందూరి చికెన్ ను ఇల్లలో ప్రయత్నించరు. అలాంటప్పుడు ఒక పెద్ద పాన్ లో కొద్దిగా నూనె వేసి తందూరిచికెన్ ను రెడీ చేసుకోవచ్చు. మరి మీకు కూడా తందూరి చికెన్ తినాలనే కోరిక ఉంటే, వెంటనే ఈ హోం మేడ్ తందూరి చికెన్ రిసిపిని ట్రై చేయండి.

Easy Tandoori Chicken Recipe (Without Oven)

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grms
మ్యారినేషన్ కోసం కావల్సిన పదార్థాలు:
పెరుగు: 1cup
ఉల్లిపాయ: 1
నిమ్మరసం: 2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 2
అల్లం: 1 చిన్న ముక్క
రెడ్ ఫుడ్ కలర్ : కొన్ని చుక్కలు
పచ్చిమిర్చి: 2
గరం మసాలా: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2-3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి తడిఆరే వరకూ పక్కను పెట్టుకోవాలి.
2. తందూరి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే, గాట్లు పెట్టుకోవాలి.
3. తర్వాత నిమ్మరసం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టించాలి. గాట్లులోకి కూడా నిమ్మరసం పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి.
4. తర్వాత ఈ చికెన్ ముక్కలను 20నిముషాలు రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.
5. అంతలోపు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. రెండు గంటల తర్వాత ఫ్రిజ్ లో ఉన్న చికెన్ ముక్కలను బయటకు తీసి మసాలా పేస్ట్ ను పట్టించాలి. చికెన్ ముక్కలకు మసాలను పట్టించడానికి ముందు మసాలాలో కొద్దిగా ఫుడ్ కలర్ ను జోడించాలి.
7. చికెన్ ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత తిరిగి చికెన్ ముక్కలను రిఫ్రిజరేటర్ లో 30-40నిముషాలు ఉంచాలి.
8. నాలుగు గంటల తర్వాత మ్యారినేట్ చికెన్ బయటకు తీసి, పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందోలో చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10-15నిముషాల వరకూ ఒక్కో వైపు బాగా కాలనివ్వాలి. 15నిముషాల తర్వాత చికెన్ ను మరోవైపు తిప్పి మీడియం మంట మీద ఇలా అన్నివైపులా నిధానంగా వేగనివ్వాలి.
9. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. అంతే ఈజీ తందూరి చికెన్ రెడీ.

English summary

Easy Tandoori Chicken Recipe (Without Oven)

If you love to hog on chicken, then we are sure that tandoori chicken tops your list of favourite chicken recipes. Tandoori chicken is basically marinated chicken cooked in a tandoor oven or a normal grill oven. The meat is cooked till tender and the spices give a delicious aroma and flavour to the chicken.
Story first published: Tuesday, October 14, 2014, 18:12 [IST]
Desktop Bottom Promotion