For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేషన్ ఎగ్ దోస: హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఏదైనా హెల్తీగా తినాలంటే చటుక్కున గుర్గొచ్చేది గుడ్డు, చిటికెలో గుడ్డుతో తయారుచేసే ఆమ్లెట్ రెడీ అయ్యిపోతుంది. అంతే కాదు, గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా గుడ్డులో న్యూట్రీషియన్ విలువలు మరియు ప్రోటీలు అధికంగా ఉండటం వల్ల దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రంలో హెల్తీ స్నాక్ రిసిపిగా తీసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉంటుంది. అదే విధంగా పొట్టను నింపుతుంది.

అయితే ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు వండినట్లు వండితో కొంచెం బోరుకొడుతుంది కాబట్టి, కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ కూడా మార్చే విధంగా ప్రయత్నించాలి. అటువంటి వంటల్లో ఎగ్ బేసన్ దోస రిసిపి ఒకటి. చాలా సింపుల్ గా చాలా త్వరగా తయారవుతుంది. అద్భుతమైన రుచి అందిస్తుంది. గుడ్డులోని ఐరన్, క్యాల్షియం మన శరీరానికి చాలా అవసరం అవుతుంది. అయితే గుడ్డు-బేషన్ రెండింటి మిశ్రమాన్నిఒక్కే సారి ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎగ్ దోసెను 5-10నిముషాల వరకూ ఉడికించాలి. మరి ఈ స్పెషల్ ఈవెనింగ్ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేద్దామో చూద్దాం...

Egg Besan Dosa For Healthy Evening Snack

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 2
శెనగపిండి: 1cup
ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగినవి)
టమోటో: 1(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 1 లేదా 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
మిరియాలపొడి: 1/2tsp
పసుపు: 1/2tsp
కారం: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి ముక్కలు మరియు పెప్పర్ పౌడర్, పసుపు, కారం, కొత్తిమీర తరుగు మరియు ఉప్పును వేసి మొత్తం మిశ్రమాన్ని స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి తిరిగి అదే స్పూన్ తో మరో సారి మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులో రెండు గుడ్లను పగులగొట్టి పోసి ఎగ్ బీటర్ తో బీట్ చేయాలి.
4. ఈ మొత్తం మిశ్రమం కలగలిసినప్పుడు, మరోసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి.
5. తర్వాత, ఫ్లాట్ ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, వేడయ్యాక దాని మీద కొద్దిగా నూనె చిలకరించి తర్వాత ఈ గుడ్డు శెనగపిండి మిశ్రమాన్ని తీసుకొని పాన్ మీద పోయాలి. పోసిన తర్వాత సర్క్యులర్ మోషన్ లో పాన్ మొత్తం సర్ధాలి(దోసెలాగే పాన్ మొత్తం సర్ధాలి)
6. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా త్రిప్పుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి.
7.ఇలా కాలుతున్నప్పుడు అందులో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ బేశన్ దోసె రెడీ...

English summary

Egg Besan Dosa For Healthy Evening Snack

Eggs are a source of calcium for the body. This morning we share with you a yummy vegetarian breakfast recipe - egg besan dosa. This easy egg recipe does not consume too much of time as well, as egg takes a minimum of 5 to 10 minutes to cook.
Story first published: Wednesday, November 12, 2014, 16:09 [IST]
Desktop Bottom Promotion