For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్-క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్

|

ఎగ్ ఫ్రైడ్ రైస్ అతి త్వరగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకొనే వంటకం. ఇది బ్రేక్ ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నభోజనం లేదా డిన్నర్ లోనూ తినవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లకు తయారు చేసి ఇవ్వొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. వర్షాకాలంలో అయితే మరింత రుచిగా... కారంగా తయారు చేసుకొని తినవచ్చు.

గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఎగ్ తినడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొన్నట్లైతే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. గుడ్డును ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ‘ఐ'సైట్ ను తగ్గించి కొవ్వు పెరగకుండా నిరోదిస్తుంది. ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ డి మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మరి ఇన్ని ఆరోగ్య గుణాలున్న ఈ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం....

Egg -capsicum Fried Rice

బాస్మతి రైస్: 3cups

ఉల్లిపాయలు: 2-3(సన్నగా..చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
క్యాప్సికమ్: 1(సన్నగా చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
పచ్చిమిర్చి: 3-5(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
గుడ్లు: 6
సోయా సాస్: 1tsp
గ్రీన్ సాస్: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
వైట్ వెనిగర్: 2tbsp
కరివేపాకు: 2రెమ్మలు
ఆవాలు: కొద్దిగా
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు బియ్యంకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్ లో అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిఅయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి. కొద్దిగా ఉప్పు చిలకరించడం వల్ల త్వరగా, మెత్తగా ఉడికుతాయి.
4. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో గుడ్డు పగులగొట్టి పోయాలి, దాంతో పాటు కొద్దిగా పెప్పర్ పౌడర్, ఉప్పు చిలకరించి మీడియం మంట మీద ప్రై చేసుకోవాలి.
5. మొత్తం మిశ్రమం వేగుతున్నప్పుడు అందులో వైట్ వెనిగర్, సోయాసాస్, గ్రీన్ సాస్ కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. అంతే మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ...

English summary

Egg -capsicum Fried Rice

Egg fried rice is one of the simple recipe which can be prepared instantly. Every child likes to have fried rice with egg as his lunch. People love to eat this fried egg recipe during winter season. Hot and spicy delicious taste make people go mad during rainy season.
Story first published: Saturday, December 27, 2014, 15:10 [IST]
Desktop Bottom Promotion