For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రుమ్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్

|

మనకందరికీ నచ్చిన చాలా ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మష్రుమ్ జోడిస్తే మరింత టేస్ట్ మరింత ఆరోగ్యం.

మష్రుమ్(పుట్టగొడుగులు)తినడానికి రుచి మాంసాహారంలాగే ఉంటుంది. కానీ పక్కా వెజిటేరియు వెజిటేబుల్, ఎగ్ మరియు మష్రుమ్ ను ఇక్కడ ఉపయోగించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో తయారుచేస్తున్నాం. ఫ్రైడ్ రైస్ చాలా మందికి ఇష్టమైన రుచికరమైన డిష్. అలాగే ఈ మష్రుమ్ మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్ ను కూడా చాలా మంది ఇష్టపడుతారు. మీకుటుంబ సభ్యులతో పాటు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మష్రుమ్ రుచి మరియు సువాసన చాలా ఘాటుగా కొత్త రుచి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు ఒక కొత్త ట్రీట్ అనిపించవచ్చు. కాబట్టి, ఈ రుచికరమైన నాన్ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి ఇది ఒక మంచి సమయం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..

Egg and Mushroom Fried Rice

కావలసిన పదార్థాలు:
అన్నం: 1cup
తరిగిన ఉల్లిపాయలు: 1/2cup
అల్లంవెల్లుల్లి పేస్టు:1tsp
మష్రూమ్స్(చిన్న ముక్కలు): 1/2cup
టమేటో:1
గుడ్డు:1
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1/2tsp
నిమ్మరసం: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 1tbsp

తయారుచేసే విధానం:
1. ముందుగా పాన్ లో నూనెవేసి వేడయ్యాక అందులో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టువేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వత మష్రూమ్స్ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.
3. ఇప్పుడు అందులోనే కారం, జీరా, ధనియా పొడులు, చాట్ మసాల, కొత్తిమీర, ఉప్పు రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం బాగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి.
5. చివరగా నిమ్మరసం కూడా చిలకరించి మరో సారి కలగలుపుకోవాలి. అంతే మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్‌ని (చల్లారకుండా) వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Egg and Mushroom Fried Rice


 Mushroom fried rice is very easy to prepare and also very popular among kids and adults.The quickest—and most authentic—way to make this hearty version of a Chinese-restaurant favorite is to start with leftover rice (you'll need about three cups). But even if you start with raw rice, you'll still be ready to eat in well under an hour.
Story first published: Monday, October 27, 2014, 12:19 [IST]
Desktop Bottom Promotion