For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ ఎగ్ పకోరా కర్రీ రిసిపి

|

గుడ్డుతో తయారు చేసే వంటలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా పిల్లలకు. గుడ్డుతో తయారుచేసిన ఆమ్లెట్ అన్నా, లేదా ఉడికించిన గుడ్డు అన్నా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేస్తారు. అయితే ఈరోజు వీటన్నింటి కంటే కొంచె డిఫరెంట్ వంటను ట్రై చేస్తున్నాయం. ఇటువంటి వంటలు చాలా అరుదుగా తయారుచేస్తుంటారు.

ఎగ్ పకోర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది . ఈ ఎగ్ పకోడా, పొటాటో, శెనగపిండ్, కాంబినేషన్ చాలా అద్భుతంగా టేస్టీగా మరియు స్మూత్ గా పకోరా తయారుచేయబడి, గ్రేవీలో ఉడికించడం వల్ల చాలా అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. మరి ఈ టేస్టీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Egg Pakora Curry Recipe

కావల్సిన పదార్థాలు:
పకోర కోసం:

గుడ్లు: 2
బంగాళ దుంపలు: 2 (ఉడికించి, మెత్తగా చేయాలి)
శనగ పిండి : 2tbsp
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

కర్రీ కోసం:
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటో గుజ్జు: 2tbsp
జీలకర్ర: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్డును పగలగొట్టి, లోపలి మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలకొట్టాలి.
2. తర్వాత అదే గిన్నెలో ఉడికించి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, శెనగపిండి మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఎగ్ బీటర్ లేదా స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
4. నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఒక గుడ్డు మిశ్రమాన్ని తీసుకొని చిన్నగా పోయాలి.
5. మీడియం మంట మీద పకోరాలను బాయిల్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పక్కన తీసి పెట్టుకోవాలి.
6.ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయ పాస్ట్ వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
8. ఇప్పుడు అందులోనే టమోటో గుజ్జు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర, ధనియాలపొడి వేసి మరో 3,4నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
9. అలాగే గరం మసాలా పౌడర్ మరియు ఉప్పు కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి.
10. మిక్స్ చేసిన తర్వాత అందులో అరకప్పు నీళ్ళు పోసి గ్రేవీని 5నిముషాలు ఉడికించుకోవాలి.
11. ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పకోరాలను వేసి నిదానంగా ఉడికించుకోవాలి .
12. ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎగ్ పకోరా కర్రీ రెడీ. అన్నంకు ఇది ఒక మంచి కాంబినేషన్.

English summary

Egg Pakora Curry Recipe

Egg is a favourite item for almost every one in the family. Kids especially love to eat eggs. Eggs are loved by all in every form, whether it is boiled or made into an omelette. But today we are going to try out a completely different recipe with eggs which is unusual and tasty as well.
Story first published: Tuesday, December 10, 2013, 16:35 [IST]
Desktop Bottom Promotion