For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ : ఎగ్ పరోటా రిసిపి

|

గుడ్డు అత్యంత ఎక్కువ ప్రోటీనులు కలిగిన ఒక హెల్తీ ఫుడ్. మీరు వారానికి కనీసం రెండు సార్లు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ మీల్ ను తీసుకోవాలి. మీ దినచర్యను ఒక ఎగ్ తో బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభించినట్లైతే, ఆరోజంతటికీ మీకు సరిపడే, ఎనర్జీని మీరు పొందగలుగుతారు. ఎనర్జీ లెవల్స్ మాత్రమే కాదు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం గుడ్డు నుండి పుష్కలంగా అందుతుంది. ఈ ఎగ్ పరోటా రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు.

ఈ ఎగ్ పరోటా రిసిపికి మీకు చాలా తక్కువ పదార్థాలు మాత్రమే అవసరం అవుతాయి. మరి ఇలాంటి హెల్తీ మరియు టేస్టీ ఎగ్ పరోఠా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...మన దినచర్యకు సరిపడే ఎనర్జీలెవల్స్ ను పెంచుకుందాము...

Egg Paratha Recipe For Breakfast

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
గుడ్లు: 4
నూనె: 1tbsp
బటర్ లేదా నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుపిండిని కొన్ని నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి.
2. పిండి కలుపుకొన్న తర్వాత, దానికి పల్చని తడిగా ఉండే క్లాత్ ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు, ఆ పిండి నుండి కొద్దిగా (బాల్ సైజ్)పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి.
4. ఇలా వత్తుకొన్న చపాతీ మీద కొద్దిగా నూనె చిలకరించి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి సెమీ సర్కిల్ షేప్ లో రోల్ ఫోల్డ్ చేసుకోవాలి.
5. తిరిగి మరికొద్దిగా నూనె ఉపయోగించి తవాను వేడి చేసి, చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
6. కాలేటప్పుడు , చపాతీ పై పొరలాగా తీసి నిధానంగా దాని మీద గుడ్డు పగులగొట్టి పోయాలి.
7. ఇప్పుడు మరికొద్దిగా నూనెను చిలకరించి గోల్డ్ కలర్ వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి.
8. అదేవిధంగా పిండి మొత్తాన్ని మీకు కావల్సినన్ని ఎగ్ పరోటాలను తయారుచేసుకోవాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఎగ్ పరోటా రిసిపి రెడీ...

English summary

Egg Paratha Recipe For Breakfast


 Eggs is one of the high protein foods you should have at least twice in a week in one meal. If you begin your day with an egg on your plate you will surely pass the day with a lot of energy. Eggs are also high in calcium and very essential for women who are pregnant. This egg paratha recipe is easy to make and will be loved by both - young and old. To make this yummy egg paratha recipe you need only few ingredients.
Story first published: Tuesday, January 6, 2015, 9:39 [IST]
Desktop Bottom Promotion