For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామానికి ముందు తినే ఎగ్ సలాడ్ రిసిపి

|

ఎగ్ సలాడ్ రిసిపి చాలా రుచికరమైనది మరియు హెల్తీ కూడా . వ్యాయామం చేయడానికి ముందు ఇటువంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తక్షణ ఎనర్జీని అందిస్తుంది. వ్యాయామం చేయడానికి అవసరం అయ్యే విటమిన్స్ న్యూట్రీషియన్స్, క్యాల్షియం, ప్రోటీన్స్ ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ లో పుష్కలంగా మన శరీరానికి అందుతాయి.

ఆకుకూరలు, గుడ్డు, మరియు టమోటో మూడింటి కాంబినేషన్ తో తయారుచేసిన సలాడ్, వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత ఎనర్జీ అందించి శరీరానికి వెచ్చదనం అందిస్తుంది. మరి ఈ హెల్తీ సలాడ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Egg Salad Recipe Before Workouts

కావల్సిన పదార్థాలు:

ఆకుకూర తరుగు: 1cup
గుడ్లు: 2
టమోటో: 2 మీడియం

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి, నీరు మొత్తం ఒడిగిపోయే వరకూ అలాగే పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు గ్రిల్ ఆన్ చేసి, వేడయ్యే వరకూ అలాగే ఉంచాలి.
3. తర్వాత నీటిలో గుడ్లను వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు టమోటోలను స్లైస్ గా కట్ చేసి గ్రిల్లో పెట్టాలి.
5. టమోటోస్లైస్ తో పాటు గుడ్లు కూడా ఉడికేంతలోపు, ఆకుకూరను గ్రిల్ ప్లేట్ లో సర్ధుకోవాలి.
6. గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాత, పొట్టు తొలగించి నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
7. ఆకుకూరను సర్దిన ప్లేట్ లో గ్రిల్లో ఉడికించిన టమోటో స్లైస్, కట్ చేసిన గుడ్డును పెట్టాలి. అంతే ఎగ్ సలాడ్ రిసిపి రెడీ. మీరు ఈరుచికరమైన ఎగ్ సలాడ్ తినడానికి ముందు, ఒక గ్లాసులు నీళ్ళు ఖచ్చితంగా త్రాగాలి. అవసరం అయితే పెప్పర్, సాల్ట్ ను కూడా చిలకరించుకోవచ్చు.

English summary

Egg Salad Recipe Before Workouts

This egg salad recipe has a lot of flavour since it contains leafy veggies which are naturally sweet, since it is spinach. To make this warm up breakfast, you will only need three ingredients to complete your healthy meal, which is - egg, spinach and tomatoes.
Story first published: Wednesday, July 23, 2014, 17:53 [IST]
Desktop Bottom Promotion