For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ గార్లిక్ ఎగ్ రిసిపి : సింపుల్ అండ్ టేస్టీ

|

హాట్ హాట్ గార్లిక్ ఎగ్ రిసిపి

గుడ్డుతో చాలా సింపుల్ గా వివిధ రకాల వంటలను తయారుచేసుకోవచ్చు. వెరైటీ తయారుచేసే గుడ్డు వంటలు సింపుల్ మాత్రమే కాదు, రుచిగా తగిన ఆరోగ్యంను అందిస్తాయి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గుడ్డులో ప్రోటీనులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యనిపుణులు రెగ్యులర్ డైట్ లో గుడ్డ తప్పనిసరి అని సలహాలిస్తుంటారు. అందుకే ప్రస్తుత మాంసాహరం తీసుకోని వారు కూడా చాలా మంది ఎగటేరియన్స్ గా మారుతున్నారు.

మీ టేస్ట్ బడ్స్ కు రుచికరంగా పుల్లగా, కారంగా ఉండాలంటే..ఈ ఎగ్ రిసిపి ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. గార్లిక్ ను ఎక్కువగా వేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ తోపాటు, డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ రుచికరమైన ఎగ్ రిసిపి పీస్ పులావ్ మరియు పుల్కాలకు మంచి కాంబినేషన్ . ఉడికించిన గుడ్డులో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతో పాటు, శరీరానికి, ఎముకలు, దంతాలకు అవసరం అయ్యే క్యాల్షియంను పుష్కలంగా అందిస్తాయి . ఇలాంటి వంటను మద్యహ్నాన సమయంలో తీసుకుంటే మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. మరింకెదుకు ఆలస్యం సింపుల్ అండే టేస్టీ ఎగ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Egglicious: Hot Garlic Egg Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4 ( ఉడికించి పొట్టు తీసి, పచ్చసొన తొలగించి కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 10(ఒలిచి, శుభ్రం చేసి పెట్టుకోవాలి )
ఆయిల్: 1 tsp
కొత్తిమిర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 2tbsp
జీలకర్ర పొడి: tbsp
నిమ్మరసం :2tbsp
పసుపు: 1 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పెప్పర్ పౌడర్: 1tbsp
జీలకర్ర: 1tbsp
ఎండు మిర్చి: 3
పెప్పర్ పౌడర్: 1/2tbsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆవాలు : 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో పసుపు మరియు కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. అలాగే కారం, జీలకర్ర పొడి కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
4. కొద్దిసేపటి తర్వాత అందులో నిమ్మరసం మరియు ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి.
5. మొత్తం పోపు మంచిగా వేగే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేసి స్టౌ మీద నుండి క్రిందికి దింపుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి , నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తరవ్ాత అందులో జీలకర్ర వేయాలి.
7. తర్వాత ఎండు మిర్చి కూడా వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
8. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ మరియు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. పోపు వేగిన తర్వాత కట్టి చేసి పెట్టుకొన్న గుడ్డు ముక్కల్లో ఈ పోపు వేసి బాగా కలియ బెట్టుకోవాలి. ఇలా మొత్తం మిశ్రం ఒక దానికిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే స్పైసీ గార్లిక్ ఎగ్ ఫ్రై రిసిపి రెడీ..

English summary

Egglicious: Hot Garlic Egg Recipe


 If you have your rice ready or your rotis and in the mood for something spicy and tangy, then this garlic egg recipe is a must try, this afternoon. To prepare this garlic egg recipe you need to be used to the garlic taste. If you dislike the taste, you will not be able to enjoy this recipe with a smile.
Story first published: Tuesday, March 17, 2015, 14:50 [IST]
Desktop Bottom Promotion