For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లెయిన్ రైస్ కాంబినేషన్ కోకోనట్ ఫిష్ కర్రీ

|

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే.సాధారణంగా మన శరీరానికి చాలా రకలా విటమిన్లు, ప్రోటీనులు అవసరం. వీటితో పాటు మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం అవుతుంది. మనశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సీ ఫుడ్ ను మన డైలీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. సీఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎందుకంటే ఇందులో వివిధ రకాలైన విటమిన్లు, ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను)నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది. చేపల్లో కూడా చాలా రకాలు న్నాయి. సాల్మన్, మకెరెల్, తున, స్వోర్డ్ ఫిష్, వీక్ ఫిష్, సార్డిన్స్, మొదలగునవి. వీటిని వండినప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి.

Fish Curry With Coconut Recipe

మిల్లెట్(ఫిష్): ½ kg(washed and cut)
ఉల్లిపాయలు: 3 + 1
వెల్లుల్లి: 2 pods (minced)
చింత గుజ్జు: 1tbsp
పసుపు: 1tsp
ఆవాలు: ½tsp
మెంతులు: ½tsp
జీలకర్ర: 1tsp
కొబ్బరి: 2 cups (cut into medium sized pieces)
ఎండుమిర్చి: 1tbsp
ధనియాల పొడి: 2tbsp
పెప్పర్ పౌడర్: 1tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా


తయారు చేయు విధానం:

1. ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలను, వెల్లుల్లి, ఉల్లిపాయ, పసుపు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ మరయిు ఉప్పు వేసి, తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. అంతలోపు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు వేసి వేగించుకోవాలి. తర్వాత అలాగే తరిగి పెట్టుకొన్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేగించుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వేగించుకొన్న వాటిని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకొన్న మిశ్రమంలో చింత పండు గుజ్జు మరియు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.
4. ఈ మసాల మిశ్రమం (గ్రేవీ)చిక్కగా ఉన్నట్టైతే మరి కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పోపు పెట్టి బాగా కాగనివ్వాలి.
5. తర్వాత గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకూ వేయించి అందులో చేప ముక్కులు వేసి పది నుండి పదిహేను నిముషాల పాటు మీడియ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఫిష్ కర్రీ విత్ కోకోనట్ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

English summary

Fish Curry With Coconut Recipe | కోకోనట్ ఫిష్ కర్రీ-ప్లెయిన్ రైస్ కాంబినేషన్


 Fish curry can be prepared using many ingredients. Have you tried fish curry with coconut? In the Southern states of India, many recipes are prepared using coconut as one of the chief ingredients.
Story first published: Monday, March 11, 2013, 14:35 [IST]
Desktop Bottom Promotion