ఫిష్ తందూరి మసాలా :పంజాబి రిసిపి

Posted By:
Subscribe to Boldsky

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. ఫస్ట్ టైమ్ చేప వంటకాన్ని రుచి చూడాల్సి వచ్చినప్పుడు తందూరి మసాలా చాలా సులభం, మరియు టేస్టీ. ఈ వంటకానికి కావల్సి ముఖ్యమైనటువంటి పదార్థా తందూరి మసాలా పౌడర్.

ఫిష్ తందూరి మసాలా పంజావీ రిసిపి. ట్రెడిషినల్ వంటకం. ముఖ్యంగా తందూరి ఫిష్ మసాలాను చేపముక్కలకు పట్టించి తయారు చేస్తారు. మరికొంత మంది తందూరి మసాలా పట్టించి తర్వాత మైక్రోవోవెన్ లో ఫ్రై చేసుకొని తర్వాత తందూరి మసాలా తయారు చేస్తారు. తందూరి మసాలా గ్రిల్డ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Fish Tandoori Masala From Punjab

కావల్సిన పదార్థాలు:

ఫిష్ ఫిల్లెట్: 8(పాంప్రెట్, బెట్కి, లేదా బోన్ లెస్ ఫిఫ్)
తందూరి మసాలా: 3tbps
పెరుగు: 100grams
పచ్చిమిర్చి: 5
ఉల్లిపాయలు: 1(కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tbsp
కారం: 1tsp
నిమ్మరసం: 1tbsp
ధనియాల పొడి: 1tsp
కొత్తిమీర తరుగు: 2sprigs
నూనె: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు పచ్చిమిర్చి మరియు కొద్దిగా కొత్తిమీర ను పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఈ పేస్ట్ లో రెండు చెంచాలా పెరుగు కలపాలి, అలాగే రెండు చెంచాల తందూరి మసాలా, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేయలి.
3. తర్వాత చేపముక్కలను శుభ్రం చేసుకొని తడి ఆరిన తర్వాత పైన తయారు చేసుకొన్న తందూరి మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కావలంటే కొంచెం నిమ్మరసం చేపముక్కలపైన చిలకరించుకోవచ్చు.
4. ఇప్పుడు బేకింగ్ పాన్ తీసుకొన్ని స్టౌ మీద పెట్టి వేడయ్యాక నూనె వేసి వేడి అయిన తర్వాత చేపముక్కలను వేసి పైన మరొకొంత మసాలా మిశ్రమాన్ని మారినేట్ చేయాలి.
5. తర్వాత కొద్దిసేపు ఎక్కువ మంట మీద తర్వాత మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. దీన్ని మైక్రోవోవెన్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చేపముక్కలను మద్య మద్యలో పైకి క్రిందికి మార్చుతుండాలి. అప్పుడే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతుంది.
6. ఇప్పడు బాటమ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కులు వేసి ఐదు నిముషాల పాటే వేయించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే తందూరి మసాలా పౌడర్, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి.
8. తర్వాత అందులోనే మిగిలిన పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత గ్రిల్డ్ ఫిష్ (ఫ్రైచేసుకొన్న ఫిష్ ను, ఉడుకుతున్న మసాలా కర్రీలో వేసి రెండు మూడు నిముషాల ఉడికించాలి. అంతే తందూరి ఫిఫ్ మాసాలా రెడీ.

English summary

Fish Tandoori Masala From Punjab | తందూరి మసాలా ఫిష్ కర్రీ

People who are not fish eaters are usually scared to try fish curry. We fear that the strong smell of fish will not be very appetizing. So if you are just turning to eat fish for the first time, then fish tandoori masala is a recipe that is safe to try. The main ingredient of this dish is tandoori masala powder. Thus fish tandoori masala does not have a stench of fish.
Please Wait while comments are loading...
Subscribe Newsletter