For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిష్ యోగర్ట్ రిసిపి : స్పెషల్ సీ ఫుడ్

|

మాంసాహార ప్రియులకు చేపలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ఉండే వారు చేపలతో వివిధ రకాలుగా వెరైటీ వెరైటీ ఫిష్ వంటకాలను తయారు చేస్తుంటారు. చేపలు ఏవిధంగా వండినీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలను కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కట్ లెట్, ఫిష్ స్నాక్స్ మొ... మీ ఆరోగ్యం కోసం ఏరకమైన చేపలైనా సరే ఎంపిక చేసుకోండి. ఎందుకంటే చేపలు ఏరకమైనా వాటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చుతాయి.

ఫిష్ కర్రీని వివిధ రకాలుగా వండుతారు. ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా వండుతారు. అయితే వేటికవే ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. మరి పెరుగుతో ఫిష్ కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒక సారి ట్రై చేయవచ్చు.

Fish Yogurt (Doi Maach) Recipe

కావల్సిన పదార్థాలు:

వైట్ ఫిష్: 500grms
పెరుగు: 2cups(చిక్కగా పేస్ట్ లా ఉండాలి)
మైదా: 1/2cup
అల్లం-వెల్లుల్లిపేస్ట్ : 2tbsp
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి : 3-5
కారం: 1tsp
పసుపు: 1/4tsp
ధనియాల పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
దాల్చిన చెక్క: కొద్దిగా
యాలకలు: 1 లేదా 2
నూనె: తగినంత
ఉప్పు రుచికి సరిపడా
నీళ్ళు : సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా చల్లిపెట్టాలి
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో చేపముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత వేరే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో దాల్చిన చెక్క, మరియు యాలకలు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్, కారం, పసుపు, ధనియాలపొడి మరియు జీలకర్ర వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు వేసి మరో 2 నిముషాలు వేగించుకోవాలి. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత, సరిపడా నీళ్ళు పోసి 5 నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. నూనె పైకి తేలే వరకూ ఉడికించి, తర్వాత చేపముక్కలు వేసి 10-15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఫిష్ యోగర్ట్ రెడీ. వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

English summary

Fish Yogurt (Doi Maach) Recipe


 There are many fish recipes that are a specialty of the coastal regions in India. You can prepare many dishes using juicy fish as the main ingredient. Be it a fish curry, fish fry, fish snacks etc, you can use any healthy type of fish for cooking. Fish is very nutritious as it is filled with omega-3 fatty acids and vitamins that are healthy for the body.
Story first published: Wednesday, April 16, 2014, 13:09 [IST]
Desktop Bottom Promotion