For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ గార్లిక్ ప్రాన్ కర్రీ రిసిపి

|

చాలా మందికి సీఫుడ్ అంటే చాలా ఇష్టం. సీఫుడ్స్ లో ప్రాన్స్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ప్రాన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకోసం ప్రత్యేకంగా తయారు చేసేటప్పుడు ఈ వంట యొక్క కలర్, ఆకారం, రుచి అన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రాన్స్ ను వండేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా తయారు చేయాలి. అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చూడగానే తినాలనిపించే వంటకం.

మీ పిల్లలు ప్రాన్స్ ను ఇష్టపుడుతంటే కనుక గార్లిక్ ప్రాన్ కర్రీ ఒక మంచి వంటకం. ఇది చాలా సింపుల్ రిసిపి. ఇది చూడటానికి నోరూరిస్తూ, రుచికరంగా ఉండే డెలిషియస్ డిష్. ప్రాన్ కర్రీకి ఉపయోగించే పసుపు, ఎండు మిర్చి, ఇతర మసాలా దినుసులేవి ఈ సీఫుడ్ లో వాడరు. ఈ ప్రాన్ కర్రీ రిసిపి టేస్ట్ ముఖ్యంగా వెల్లుల్లి, టమోటోల మీద ఆధారపడి ఉంటుంది . కరివేపాకు మరింత ప్లేవర్ ను ఇస్తూ చాలా కలర్ ఫుల్ సీ ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తుంటుంది. మరి మీకూ ఈ గార్లిక్ ప్రాన్ కర్రీని తినాలనుందా..? ఐతే ఈ క్రింది పద్దతిని ఫాలో అవ్వండి...

Garlic Prawn Curry Recipe

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 250gms(మీడియం సైజ్)
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి: 8-10రెబ్బలు(పేస్ట్ చేసుకోవాలి)
టమోటో: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
కారం: 1tsp
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
నీళ్ళు: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ ను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ తడి ఆరేలోపు, ఒక బౌల్లో నిమ్మరసం, ఉప్పు, మిక్స్ చేసి తర్వాత ప్రాన్స్ కు మ్యారినేట్(అప్లై) చేసి పది నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

2. 10నిముషాల తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద 3-4నిముషాలు వేగించుకోవాలి.

3. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.

4. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న టమోటో, పసుపు, కారం, పంచదార మరియు ఉప్పు వేసి మరో 5నిముషా పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి.

5. టమోటో వేగుతూ మెత్తబడ్డాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ ను వేసి ఒక నిముషం వేగించాలి, తర్వాత సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.

6. తర్వాత అందులో కరివేపాకు వేసి, మూత పెట్టి 10నిముషాల పాటు అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. ప్రాన్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే గార్లిక్ ప్రాన్ కర్రీ రెడీ. ఈ కర్రీనీ వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Garlic Prawn Curry Recipe

Prawns are a favourite seafood item for most of us. The kids especially are very fond of prawns. So, while preparing prawn curry we have to be careful about the ingredients.
Story first published: Tuesday, June 11, 2013, 16:37 [IST]
Desktop Bottom Promotion